• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Global Investors Summit 2023 : ఆధునికత సంప్రదాయల మేళవింపు అతిథి దేవోభవ’ అంటూ విశాఖ పలకరింపు

Global Investors Summit 2023

Sandhya by Sandhya
March 3, 2023
in Latest News, Special Stories
245 8
0
Global Investors Summit 2023
492
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Table of Contents

Toggle
  • Global Investors Summit 2023 : ఆధునికత సంప్రదాయల మేళవింపు అతిథి దేవోభవ’ అంటూ విశాఖ పలకరింపు..
  • నిఘా నీడలోవిశాఖ :
  • అతిథులకు కలంకారీ అలంకారపు వస్తువులతో అహ్వాన సత్కారం:
  • సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట:

Global Investors Summit 2023 : ఆధునికత సంప్రదాయల మేళవింపు అతిథి దేవోభవ’ అంటూ విశాఖ పలకరింపు..

• పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
• 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదిక
• పెట్టుబడులు సమావేశాలు చర్చలేకాదు సాయంత్రం సాగరతీరాన అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు
• సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట
• వివిధ రకాల వంటకాలు , కోస్తా, రాయలసీమ, నెల్లూరు రుచులతో విందు భోజనాల ఎర్పాటు

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేయనున్నారు.ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వేదికలు సిద్ధం చేశారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలకు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సమావేశానికి ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, పాతిక దేశాల ప్రతినిధులు, మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ వస్తన్నారు.

Global Investors Summit 2023

నిఘా నీడలోవిశాఖ :

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023 విశాఖ పోలీసులు తొలిసారిగా స్నిఫర్ డాగ్ టీమ్‌ను సెక్యూరిటీలో వినియోగించనున్నారు. ఇప్పటి వరకు విచారణకు మాత్రమే ఉపయోగించే డాగ్‌ స్క్వేడ్‌ను తొలిసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023లో వాడుతున్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారీగా సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులతోపాటు, స్వదేశ పారిశ్రామిక దిగ్గజాలు కూడా రానున్నారు. అందుకే విశాఖలో చార్టెడ్‌ ఫ్లైట్లు చక్కర్లు కొట్టనున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా చార్టెడ్‌ విమానాలు ల్యాండ్ కానున్నాయి. గంటకు సుమారు పది విమానాల రాకపోకలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కోసం పదహారు పార్కింగ్ బేస్ సిద్దం చేశారు. ఇందులో 12 కొత్తవికాగా…4 పాతవి. ఇవి ఎయిర్‌బస్‌ 777, ఎయిర్‌ బస్‌ A320, బోయింగ్‌ 747, ఏటీఆర్‌, చోపర్స్‌కు సరిపోనున్నాయి. విమానాల ల్యాండింగ్ కోసం 11 వందల అడుగుల రన్‌వే సిద్ధంగా ఉంది. ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ను ఇండియన్ నేవీ చూస్తోంది. పార్కింగ్‌, ప్రయాణికుల రాకపోకల అంశాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ చూసుకోనుంది.

అతిథులకు కలంకారీ అలంకారపు వస్తువులతో అహ్వాన సత్కారం:

ఈ సదస్సుకు వచ్చే అతిథులు, ఇతరులకు ఏపీ హస్తకళాకారులు రూపొందించిన గుర్తింపు కార్డులను ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న కళానైపుణ్యం అతిథులకు తెలిసేలా వాటిని తయారు చేస్తున్నారట. తోలుబొమ్మల తయారీలో వాడే మెటీరియల్‌తో బ్యాడ్జీలు చేసి వాటి వెనక కలంకారీ డిజైన్లు ముద్రించమన్నారు. సమ్మిట్‌లో పాల్గొనే వారికి ఇచ్చే నోట్ బుక్స్ పై కూడా కలంకారీ డిజైన్ ప్రింట్ వేయించారు. పెన్నులపై రాష్ట్ర పక్షి చిలుక లోగోతోపాటు అడ్వాంటేజ్ ఏపీ అని గుర్తును ముద్రిస్తున్నారు. ముఖ్య అతిథులకు సిల్వర్ పిలిగ్రీతో చేసిన రాష్ట్ర జీఐఎస్ లోగో బహూకరించనున్నారు.

Global Investors Summit 2023

కళాత్మకత ఉట్టి పడేలా హస్తకళాకారుల నైపుణ్య ప్రతిబించేలా ప్రత్యేక గిఫ్టు బాక్సు ప్రత్యేకంగా తయారు చేయించిన గిఫ్టు. ఇందులో సిరామిక్ ప్లేటు, పెన్ను, అరకు కాఫీ, ఉడ్ కోస్టర్స్‌తో కూడిన బాక్సులను ఉంచుతుతోంది. దీన్నే వచ్చిన గెస్ట్‌లకు బహుమతిగా ఇవ్వనుంది. ఈ సిరామిక్ ప్లేట్లను కలంకారీ డిజైన్‌తో అందంగా తీర్చిదిద్దారు. వాటి వెనక రాష్ట్ర చిహ్నంతోపాటు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జీఐఎస్ లోగోను ముద్రించారు. ఈ సదస్సులో వన్ డిస్ట్రికస్, వన్ ప్రొడెక్ట్ కింద రాష్ట్రంలోని హస్త కళలు, వివిధ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట:

పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా వచ్చిన అతిథిలకు సంప్రదాయాలు, కళానైపుణ్యాలను కూడా వివరించేలా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు కూచిపూడి నృత్యం, జానపద కళలతో ఈ ప్రదర్శనలు ఉండనున్నాయి. ప్రముఖ నర్తకి యామిని రెడ్డి కూచిపూడి నృత్యం చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తుషార్ కలియాతో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించనున్నారు. వీటితోపాటు థింసా, తప్పెట గుళ్లు, గరగలు, ఉరుములు, కొమ్ము నృత్యం తదితర ప్రదర్శనలు అతిథులను ఆకట్టు కోనున్నాయి.

వాస్తవిక పెట్టుబదులను ఆకర్షించి, పారదర్శకతతో సరైన విధానంతో మౌలిక సదుపాయాల రూపకల్పనతో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ సహకారంతో సత్వర అనుమతులు రాయతీలు ప్రకటించి పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తే ఈ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌ సఫలీకృత మైనట్లే.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AndhrapradeshAPGIS 2023Global Investors Summit 2023TeluguTelugu NewsVisakhapatnamVizag
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.