Happiest State in India : మన ఇండియాలోనే ఒక రాష్ట్రంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అంట.. ఆ రాష్ట్రం ఎక్కడుందో చూద్దాం.. ఇండియాలో మిజోరం ప్రజలు చాలా సంతోషంగా జీవించే వారిలో మొదటిస్థానంలో ఉన్నారు. ఇది ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఆ అధ్యయనం చేసింది గురుగ్రామ్ లోని మేనెజ్మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటెజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న రాజేష్ కే పిల్లానియా.
మిజోరాంకి ఇంకో విశేషత కూడా ఉంది, అక్షరాస్యతలో 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రెండో రాష్ట్రంగా మిజోరం ఘనత సాధించింది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విద్యార్థుల వికాసం కోసం ,అన్ని రంగాల డెవలప్మెంట్ కోసం ఎన్నో అవకాశాలు కల్పించింది.
అసలు ఒక రాష్ట్రాన్ని సంతోషకరమైన రాష్ట్రంగా ప్రకటించడానికి అక్కడ ఏ, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..ఆ రాష్ట్రంలోని ప్రజల కుటుంబ బంధుత్వాలు, సామాజిక అంశాలు ,ఉపాధికి సంబంధించిన అంశాలు, మతపరమైన ,శారీరక ,మానసిక ఆరోగ్యంతో పాటు, ఇతరులకు సహాయం చేసే మానవత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజల సంతోషంపై కోవిడ్ 19 వంటి ప్రభావం,
ఈ విధంగా మొత్తం ఆరు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి ఐజ్వాల్‌లో మిజోరం గవర్నమెంట్ హై స్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థి తన అనుభవాన్ని పంచుకున్నాడు. కుటుంబాన్ని తన తండ్రి వదిలేసి పోయినా కూడా తనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తాను చదువును కొనసాగిస్తూనే ఉన్నానని ,
చాటర్ ఎకౌంటెంట్ ని కావడమే తన లక్ష్యమని చెప్పాడు. అతని మాటల్లో అందరికీ ఆత్మవిశ్వాసం కనపడింది. మిజోరం గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి.. అతడు నేషనల్ డిఫెన్స్ అకాడమిలో చేరాలనే ధృడ సంకల్పంతో చదువుకుంటున్నట్టు చెప్పాడు. తన తండ్రి ఒక ఫ్యాక్టరీలో మామూలు కార్మికుడని ,కానీ తను అనుకున్నది సాధించడానికి మాత్రం వెనుకడుగు వేయనని,
దానికి కారణం తను చదువుతున్న గవర్నమెంట్ స్కూలు తనకు నాణ్యమైన విద్య అందించడమే.. అని ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. అక్కడ విద్యార్థులకు ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా కూడా టీచర్లతో పంచుకుంటారని, నిత్యం తమ అభ్యున్నతికి టీచర్లు కృషి చేస్తారని అక్కడ విద్యార్థులు చెబుతున్నారు.
మిజోరంలో ఉన్న సామాజిక మౌలిక అంశాలను కులమతాల పట్టింపులు లేకపోవడం. పిల్లల చదువుపై ఇంత శ్రద్ధ వహించడం. తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు లేకపోవడం .యువతకు అక్కడి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించడం. ఇవన్నీ కూడా మిజోరామ్ నీ సంతోషకరమైన రాష్ట్రంగా నిలబెట్టడంలో దోహదపడ్డాయి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం మిజోరంలోని 16 ,17 సంవత్సరాలు ఉన్న పిల్లలు చిన్న పని అని కూడా చూడకుండా, ఏదో ఒక పని చేస్తూ ఆర్థిక విషయాలలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు.