Heart at risk : భూమ్మీద రోజు రోజుకి మనుషుల సంఖ్య ఎలా అయితే పెరుగుతుందో దానికి పోటీగా జబ్బుల సంఖ్య కూడా పెరుగుతుంది. మన కంటే ముందు తరాల వాళ్లు మనకంటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. దానికి కారణం రసాయనాలు తక్కువగా వినియోగించి పండించిన ఆహార పదార్దాలు తినడం. తిన్న దాన్ని శ్రమ ద్వారా ఖర్చు చేయడం ఇంకో కారణం.
ఆ రోజుల్లో జబ్బుల జాబితా తక్కువ కానీ మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో మార్పు, చేస్తున్న పనుల్లో మార్పు వచ్చేసింది. అంతకంటే ముఖ్యంగా వాతావరణం కాలుష్యం బాగా పెరిగిపోయింది. పైన చెప్పుకున్న విషయాలు అన్ని ఒక్క ఎత్తు అయితే.. కొత్త, కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మనిషి జీవన విధానాన్ని అతలాకుతలం చేసేసాయి. 2020 నుండి అందరి నోళ్ళల్లో నానుతున్న వైరస్ కరోనా.
ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి అర్దాంతరంగా వయసుతో సంబంధం లేకుండా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు నిదర్శనం ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే.. పెళ్లి భరత్ లో డ్యాన్స్ వేసుకుంటూ ఓ అబ్బాయి, అప్పటి వరకు అందరితో ఫంక్షన్ లో హ్యాపీగా గడుపుతూ కుప్పకూలి పోయిన ఓ వ్యక్తి, జిమ్ చేస్తూ ఓ కానిస్టేబుల్.. ప్రముఖ హీరోలు..
ఇలా ఒకరి తరువాత ఒకరు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. “కార్డియటిక్ అరెస్ట్” కావడం వల్లే ఇలా జరిగింది అనేది డాక్టర్ల అభిప్రాయం. ఇన్ని రోజులు ఎక్కువగా వినిపించని ఈ మాట ఇప్పుడే ఎందుకు వినిపిస్తుంది. ఒకేసారి ఇలా మనుషుల మీద అటాక్ చేస్తుంది. “కరోనా వైరస్ దీనికి కారణం కావచ్చా?” అనేది అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా అనారోగ్యాలను జయించి, మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుందాం..