Himalayan Mountains : హిమాలయాలు ఈ పేరు వినగానే మనసంతా చల్లబడిపోతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే హిమాలయాలను చూస్తే బాగుండు అని అందరూ అనుకుంటూ ఉంటారు.అలాంటి హిమాలయాల్లో ఒకప్పుడు సముద్రం ఉండేదని తాజా అధ్యయనాల్లో వెళ్లడయింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
హిమాలయాలలో దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రం ఉండేదాన్ని జపాన్‌లోని నీగాటా యూనివర్సిటీ,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc),శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పుడున్నటువంటి సముద్రం నుంచి మిగిలిపోయినటువంటి నీటి బిందువులలో చిక్కుకుని పోయిన నిక్షేపాలను ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే భూమి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి ఆక్సిజనేషన్ ఎలా ఏర్పడిందో ఆ సంఘటనలకు గురించి వారు తెలుసుకునే అధ్యయనంలో ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు.
శాస్త్రవేత్తలకు హిమాలయాల్లో సముద్ర ఫలకాలను సంబంధించిన నీటి బిందువుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అయితే శాస్త్రవేత్తలు బృందం కనిపెట్టినటువంటి నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ నాటికి చెందినదని క్యాల్షియంను అక్కడి ప్రదేశం కోల్పోయినట్లు వారు గుర్తించారు. మహాసముద్రంలో ప్రవాహం లేకపోవడమే దీనికి కారణమని వారు వెల్లడించారు.
మహాసముద్రంలో ప్రవాహం లేకపోతే కాల్షియం అవక్షేపం అక్కడ నిల్వ ఉండదని దానిలోకి నెమ్మదిగా మెగ్నీషియం పెరిగిపోతుందని వారు వివరించారు. వాతావరణం లో ఆక్సిజన్ పెరుగుదల ఎక్కువైనప్పుడు జీవ సంబంధమైన రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన ఆర్య వివరించారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృతసర్ నుంచి మిలాన్ హిమానినాదం వరకు అలాగే డెహ్రాడూన్ నుంచి గంగోత్రి వరకు
అదృశ్యమైనటువంటి సముద్రాల ఉనికి కోసం వారు విపరీతమైన అన్వేషణ కొనసాగించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపు నీటి ఉనికిని వెల్లడించడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇది భూమి చరిత్రకు సంబంధించిన మహాసముద్రాల ఉనికి మరియు వాటి పరిణామ క్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.