జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఇచ్చిన పిలుపు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ యావత్తు హైందవ ధర్మాన్ని పాటించేవారు పరమత సహనాన్ని కోరుకునేవారు లక్షలాది దీపాలు వెలిగించి మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అంతర్వేది రధం దగ్ధం ఘటన తర్వాత జనసేన పార్టీ మరియు హైందవ ధర్మ పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు ఊహించిన దానికంటే స్పందన రావడంతో పార్టీలో సంతోషం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడినా అశాంతి వాతావరణాన్ని పారద్రోలడానికి జనసేన చేసిన ప్రయత్నాన్ని పండితపామర సహితంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పవన్ కళ్యాణ్ వైఖరిలో వచ్చిన మార్పుపై జనసేన పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి పై మాటలకు చేతలకు పొంతన లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూనే ఉంటాయి.దానికి భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హిందూ దేవాలయాల పై దాడులను ఇప్పటికే పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని దానికి తగ్గ కార్యాచరణ రూపొందించి దానిని అమలు చేయడం ద్వారా ఇక ముందు ఆ పార్టీ జెండా ఎంత పకడ్బందీగా అమలు జరుపుతున్నారు అనేది ఫస్ట్ నిరూపణ అయ్యింది.
ముఖ్యంగా మహిళల నుంచి పిల్లలు వరకు పవన్ కళ్యాణ్ పలుపునందుకుని తమ ఇంటి పూజ గదిలో దీపాలంకరణ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే విస్తృతంగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ హిందువుల మనోభావాలను గెలుచుకోవడంతో పాటు ఓటుబ్యాంకు ను సొంతం చేసుకునే విధంగా పవన్ ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చేసిన రాజకీయ ఆరోపణలని కాస్సేపు పక్కన పెడితే చాతుర్మాస్య దీక్ష లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ.. ప్రజలను చైతన్య పరచడంలో జనసేన పార్టీ సక్సెస్ అయింది అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీపారాధన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.