Ice Cream : ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాలా రకాల ఐస్ క్రీములు ఎంతో రుచితో, ఇప్పుడు మనకు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. ఎండాకాలంలో ఎండవేడికి తట్టుకోవడానికి అందరూ శీతలపానియాలను, చల్లటి ఐస్ క్రీమ్ లను ఆశ్రయిస్తూ ఉంటారు. మనకు తెలిసి ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే ఒక 500 లోపు ఉంటుంది. కానీ అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ నీ జపాన్ లోని ఓ సంస్థ తయారు చేశారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను స్థానం సంపాదించుకున్న ఈ ఐస్ క్రీమ్ నీ, “బైకుయా” పేరుతో ప్రపంచంచానికి పరిచయం చేసారు. మరీ ఈ ఐస్ క్రీమ్ ఎందుకు అత్యంత ఖరీదైంది. ఈ ఐస్ క్రీమ్ లో వాడిన పదార్థాలే చాలా ఖరీదు అయినవి. ప్రోటీన్ రుచిగా తయారైన ఈ ఐస్ క్రీమ్ లో రెండు రకాల చీజ్ ,గుడ్లు, సాక్ లీక్ పదార్థాలను వినియోగించారు.
వీటన్నింటిని పాలతో తయారు చేసిన వెల్వెట్ బేస్ లో ఉంచి, ఆ మిశ్రమంపై మరో విధమైన చీజ్ నీ, అత్యంత అరుదుగా లభించే, వైట్ ట్రబుల్ ఆయిల్, తినే బంగారు రేకులతో గార్నిష్ చేస్తారు. ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్ గా ఉండడమే కాకుండా ,ఎంతో రుచిగా ఉంటుంది. తినడం కోసం స్పూన్ నీ కూడా డిజైన్ చేపించింది కంపెనీ. ఈ స్పూన్ కూడా చాలా ప్రత్యేకమైనది.
ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంలో వాడే పద్ధతి ప్రకారం ,అక్కడి సామాగ్రితో ఈ స్పూను తయారు చేశారు. ఇందులో వినియోగించే వైట్ ట్రబుల్ చాలా ప్రత్యేకమైనది. అది ఇటలీలో మాత్రమే దొరుకుతుంది . ఈ ఐస్ క్రీమ్ తినే రెండు నిమిషాల ముందు ఫ్రిజ్ నుండి తీయాలి. ఈ ఐస్ క్రీమ్ కి ఎక్స్పైరీ డేట్ లాంటిది ఏమీ లేదు. ఎప్పుడైనా కూడా దీనిని తినవచ్చును.
కానీ పది రోజుల్లోపు తింటే ఐస్ క్రీమ్ రుచి చాలా సహజంగా ఉంటుందని కంపెనీవారు చెప్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఐస్ క్రీమ్ ధర ఎంతో తెలుసా..130 మిల్లీ మీటర్ల ‘బైకుయా’ ధర సుమారు రూ. 5 లక్షలు.