Innovations : మనం ఏదైనా పని సులభంగా జరగాలి, తొందరగా అయిపోవాలి అనుకుంటాం. పనిలో అసౌలభ్యం ఉండాలి అనుకోము. కానీ ఒక ఆర్కిటెక్ట్ డిజైనర్ మాత్రం ‘ది అన్‌కంఫర్టబుల్’ అనే ప్రాజెక్ట్ చేసింది. ఆ ప్రాజెక్టు వెనుక ఓ బాధ కలిగే కథ దాగి ఉంది. ఏథెన్స్కు చెందిన కతెరినా కంప్రాని ఆర్కిటెక్ట్ డిజైనర్.
ఏగాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్ చేసి ఆ తర్వాత ‘ది అన్‌కంఫర్టబుల్’ అనే ప్రాజెక్ట్ చేసింది. గ్రీకు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రోజులలో కతెరినా చదువు పూర్తి చేసి, జాబు కోసం వెతుకుతున్న రోజులవి. ఆ సమయంలో ఆమెకు ఎటువంటి జాబు దొరకక పోయేసరికి ఆమె చాలా ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయింది.
ఆ టైమ్ లో ఆమెకు డిఫ్రెంట్ ఆలోచన వచ్చింది. అందరూ లైఫ్ లో కంఫర్ట్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే ఎలా ఉంటుందో అనే ఆలోచన ఆమెకు వచ్చింది. వెంటనే కంప్రాని ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఫోర్క్ తల, మొండానికి మధ్యలో ఒక చైన్ పెట్టింది. ఈ ఆలోచన వింతగా ఉన్నా, మరీ చైన్ ఫోర్క్‌తో తినేదెలా? అనే డౌట్ అందరికి వస్తుంది.
ఈ ఒక్కదానితో తను ఆగిపోలేదు. ఇలా విచిత్రమైన వస్తువులను మరికొన్నింటిని కూడా కనిపెట్టింది. కానీ వాటిలో ఒక్క వస్తువు కూడా వాడడానికి పనికొచ్చేవి మాత్రం కావు. కానీ ఈ ప్రొడక్ట్స్ వల్ల మాత్రం మంచి ఉపయోగమే జరిగింది. ఆ ప్రొడక్ట్ చూసిన ప్రతి ఒక్కరి మొహంలో నవ్వు విరుస్తుంది.
కతెరినా ఇన్నొవేషన్స్ని ఫొటోలు తీసి, వాటి ఫ్రేమ్‌లను అమ్ముతుంది. ఆమె చేసే వస్తువులు దేనికి పనికిరావు అని మాత్రం అనలేము. ఎందుకంటే బ్రెయిన్ ఇంజ్యూరీ, మోటార్ కంట్రోల్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ల మీద చేసే రీసెర్చ్‌లో ఇవి ఉపయోగపడటం విశేషం.
ముందుగా ఇలాంటి ప్రోడక్ట్ చేసిన కతెరినాను చూసి అందరూ ఎగతాళిగా నవ్వారు. తను ఎన్నో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంది. రాను,రాను ఇలాంటి ప్రొడక్ట్స్ పైన అందరూ మక్కువ పెంచుకొని కతెరినాకు సక్సెస్ ని అందించారు.