Interesting Fact about Insects : ఇంట్లో ఉండే బల్బ్ చుట్టు కీటకాలు తిరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అవి వెలుతురు చుట్టు అసలు ఎందుకు చేరుతాయి..అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..కీటకాలు బల్బ్ చుట్టూ ఎందుకు తిరుగుతాయో మీకు తెలుసా..
ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కీటకాలు తమ ప్రయాణాన్ని మార్గ నిర్దేశంలో కాంతి వనరులపై ఆధారపడతాయని చెప్తున్నారు. నావికులు తమ నావలకు నావిగేట్ చేయాలని, నక్షత్రాలను ఎలా ఉపయోగిస్తారో, పురుగులు కూడా చంద్రుడు, సూర్యుడు వంటి సహజ కాంతి వనరులపై ఆధారపడతాయనీ,

అదే విధంగా ఇంట్లో లైట్ చూసిన కీటకాలు ఆ కాంతి సూర్యుడి నుండి లేదా చంద్రుడు వస్తుంది అని పొరపాటున అనుకోని అక్కడికి చేరి గందరగోళానికి గురవుతూ ఉంటాయని అందుకే బల్బు చుట్టూ అలా తిరుగుతాయని చెప్పారు. కీటకాలు ,పువ్వుల నుంచి తేనెను స్వీకరిస్తాయి.ఇవి అతినీలలోహిత కాంతిని ప్రతిబింబించడం
వల్ల, కొన్ని లైట్ బల్బులు కూడా అతినీలలోహిత కాంతిని అతి తక్కువ మొత్తంలో విడుదల చేస్తాయి. ఆకలితో ఉన్న కీటకాలు బల్బును పువ్వు అనుకోని పొరపాటు పడుతుంటాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడం కోసం కూడా పురుగులు లైట్ చుట్టూ తిరుగుతుంటాయి అని ఇంకో సిద్ధాంతం ఉంది.
ఆర్టిఫిషియల్ లైట్ కి, ఆకర్షితులయ్యే కీటకాలు భోజనం లేక తన ఫ్రెండ్స్ కోసం కూడా బల్బ్ చుట్టూ చేరుతాయని అధ్యయనాల్లో తేలింది. పూర్తిగా మూసివేసిన ప్రదేశాల నుండి కీటకాలు బయటకు రావడానికి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో కాంతి, కీటకాలకు చూపిస్తుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
