Interesting Facts about DhoraMafi Village : ఈ గ్రామం భారతదేశంలోనే, కాకుండా మొత్తం ఆసియాలోనే అత్యంత ‘బాగా చదువుకున్న’ గ్రామం. చదువు విషయానికొస్తే మనం పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న పిల్లలు బాగా చదువుతారు. ఆ నగరాల్లోని పాఠశాలలే ముందు వరుసలో ఉంటాయి అనుకుంటాం. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఓ గ్రామం ఆసియాలోనే అత్యంత విద్యావంతమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది.
ఈ గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని జవాన్ బ్లాక్‌లో ఉంది. ఈ గ్రామం పేరు “ధోరా మాఫీ”. ఈ గ్రామంలో 90 శాతం అక్షరాస్యులు. అంటే ఈ గ్రామం మొత్తం దాదాపు విద్యావంతులే. ఈ గ్రామం పేరు “లింక బుక్ ఆఫ్ రికార్డ్స్ లో” కూడా నమోదయింది. ఈ గ్రామంలో 24 గంటలు కరెంటు ఉంటుంది. అంతేకాకుండా ఆంగ్ల మాధ్యమా పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో 10 నుండి 11 వేల వరకు ప్రజలు నివాసం ఉంటారు.
ఇక్కడ 80 శాతం కుటుంబాలు ప్రభుత్వ అధికారులు. ఈ గ్రామంలో ఎక్కువ మంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్ అధికారులు ఉండడం విశేషం. ఈ గ్రామంలో వ్యవసాయం 5 సంవత్సరాల క్రితం ఆగిపోయింది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం కంటే ఉపాధి ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని నమ్ముతారు. పిల్లలను కూడా చదువుపైనే దృష్టి పెట్టేలా చూస్తారు వీళ్ళు.