Interesting Facts about Post Office : మంచు దీవిలో నడుస్తున్నా పోస్ట్ఆఫీస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ప్రపంచానికి ఈ పోస్ట్ ఆఫీస్ సుదూరంలో ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్‌లో ఉంది. ఈ పోస్టాఫీస్ ను యునైటెడ్ కింగ్‌డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. అయితే ఈ పోస్ట్ఆఫీస్ కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే..
దీనిని పోస్ట్ఆఫీస్ ల మాత్రమే కాకుండా ఒక మ్యూజియం అని కూడా అంటారు. ఈ పోస్ట్ఆఫీస్ లో నాలుగు పోస్టుమాస్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్ట్ఆఫీస్ సంవత్సరంలో కేవలం 5 నెలలు మాత్రమే పని చేస్తుంది. ఈ పోస్ట్ఆఫీస్ లో ఉన్న ఖాళీల పైన ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన చూసి ప్రపంచ నలుమూలల నుండి వందల దరఖాస్తులు అక్కడ వచ్చాయి.
ఇందులో పని చేసే వారికి పోస్ట్ఆఫీస్ తో పాటు మ్యూజియం నిర్వహణ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే పెంగ్విన్ లను లెక్కించడం కూడా ఈ పోస్ట్ఆఫీస్ లో పనిచేసే వారి యొక్క బాధ్యత. ఈ పోస్ట్ఆఫీస్ లో పని చేయాలంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నవంబర్ నుండి మార్చి వరకు ఇక్కడ పని చేయవలసి ఉంటుంది. కానీ ఆ నెలలలో అక్కడ వాతావరణం మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. ఆ వాతావరణం తట్టుకొని ఇక్కడ పని చేయాలి.
ఇక్కడ రోజుకు 12 గంటల సేపు పనిచేయవలసి ఉంటుందని హెరిటేజ్ ట్రస్ట్ సీఈవో తెలిపారు. ఇప్పటివరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. ఇక్కడ వాతావరణం తట్టుకొని పనిచేసే శారీరక దారుడ్యాం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తగినరీతిలో మెలిగే కలివిడితనం, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా పనిచేసే వారిలో ఉండాలి అని ఆయన వెల్లడించారు. అలాంటి వారి కోసమే మేము అన్వేషణ చేస్తున్నామని కూడా తెలిపారు.