Interesting Facts About Skeletons Church : మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులకు బదులుగా అస్తిపంజరాలు వచ్చి స్వాగతం పలికితే..! అది కూడా ఒకటి, రెండు కాకుండా ఏకంగా 40 వేల నుంచి 70 వేల వరకు అస్తిపంజరాలు వచ్చి మనకు స్వాగతం పలికితే ఎలా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంది కదా..! మనం ఆస్తిపంజరం చూసి భిక్క చచ్చిపోవడం మాత్రం ఖాయం. మరి ఇలాంటి వింతైన ప్రదేశం ఎక్కడ ఉంది. అక్కడ అన్ని అస్తిపంజరాలు ఉండడానికి కారణమేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
అన్ని వేల అస్తిపంజరాలు వచ్చి స్వాగతం పలికేది ఒక రోమన్ క్యాథలిక్ చర్చిలో. ఈ చర్చి యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్‌లో కుట్నా హోరాలో సెడ్లెక్‌లో ఉంది. ఈ చర్చి పేరు సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ చర్చ్ లోపల ఒక్క అడుగు వేయగానే ఏకంగా 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు మనకు స్వాగతం పలుకుతాయి. అసలు ఈ చర్చి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి..? ఇప్పుడు చూద్దాం.!
బొహిమియా రాజు పొటాకర్ ,1218లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని ,సువార్తతో ఏసు శిలువ వేయబడిన ఒటాకర్ 2 గోల్గోతా అని పిలవబడే స్థలానికి పంపి, అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తెప్పించి ,హెన్రీ సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లిస్తాడు. ఆరోజు నుంచి అది పవిత్రస్థలంగా మారింది.
అప్పటినుండి స్థానికులు చనిపోయిన తమ కుటుంబీకులను అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. అలా 14వ శతాబ్దం వరకు ఆ సాంప్రదాయం కొనసాగింది. ఆ తర్వాత యూరప్ అంతా ప్లేగు వ్యాధి సంక్రమించడంతో 30 వేల మంది ఆ వ్యాధికి బలయ్యారు. దానితోపాటు మత యుద్ధాలలో మరో పదివేల మంది వరకు చనిపోయారు.
1870లో అక్కడ చర్చి నిర్మాణం చేయాలని అనుకున్నారు. ఆ నిర్మాణం కోసం పాతిపెట్టిన శవాలను వెలికి తీసారు. అన్ని శవాల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు ఏం చేయాలో తోచని పరిస్థితులలో, వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అలా వెలికి తీసిన ఎముకలు, పుర్రెలతో, చర్చి లోపల అలంకరణ చేశారు. సృజనాత్మకత కలిగిన వారి ఆలోచన గొప్ప ఖలాఖండంగా వెలిసింది. ఇప్పుడు ఆ చర్చి ఎంతోమంది పర్యటకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఆ చర్చికి “బోన్ చర్చ్” అనే పేరు కూడా వచ్చింది.