Interesting Facts about Thomas Wedders: ఒక మనిషినికి తొండం లాంటి ముక్కు ఉంటే ఎలా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. ఆ ఊహే ఏదోలా ఉంది కదా..ముక్కు కొంచెం పెద్దగా ఉంటేనే ఎదో ఇబ్బందిగా ఉంటుంది. అందరిలాగా జీవించడం కూడా కష్టమే అని చెప్పాలి. ప్రపంచంలోనే తొండం లాంటి ముక్కు కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు.
గిన్నిస్ బుక్ లో కూడా ఆయన స్థానం సంపాదించుకున్నాడు. మళ్ళీ ఆ స్థానాన్ని పోటీ చేస్తూ ,ఆ రికార్డును బద్దలు కొడుతూ ఇంకెవరు ఆయన స్థానంలోకి ఇప్పటివరకు రాలేదు. ఆయన ఎవరు.. ఎక్కడి వాడు..ముక్కు ద్వారా గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎలా సాదించాడో.. ఇప్పుడు చూద్దాం.
ఆ అద్భుతమైన వ్యక్తి పేరు థామస్ వెడర్స్. ఈయన 1770 కాలానికి చెందిన వ్యక్తి. ఈయన ఇంగ్లాండు వాస్తవ్యుడు. థామస్ 18వ శతాబ్దంలో సర్కస్ పర్ఫామర్‌గా జీవించాడు. థామస్ కి అందరిలాగా కాకుండా ముక్కు చాలా పెద్దదిగా అంటే దాదాపు చిన్న సైజు తొండం లాగా ఉండేది. .
అలాంటి ముక్కుతోనే ఆయన గిన్నిస్ రికార్డును సాధించాడు. ఇప్పటివరకు ఆయన రికార్డ్ నీ ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. నాలుగు రోజులగా థామస్ గురించి, థామస్ ముక్కు గురించి సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి ముక్కుతో థామస్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అసలు ఎలా జీవించాడో ,
“అది ముక్కా…లేక తొండమా”..ఎంత దూరంలో ఉన్నా కూడా ఇట్టే వాసనను పసిగట్టేస్తుంది. అని థామస్ మీద హాస్యపు జల్లులు కురిపిస్తున్నారు.