Interesting Facts : మనం ఎక్కువగా కొన్ని పండగల సందర్భంగా దేవాలయాల్లో భక్తులు నిప్పుల గుండం మీద నడవడం చూస్తుంటాము. ఆ అగ్నిగుండం మొత్తం ఎర్రగా నిప్పుల కొలిమిలా మండుతూ ఉంటుంది. అలాంటి గుండంలో కాళ్లకు ఏ మాత్రం రక్షణ లేకుండా వాళ్ళు చక, చక నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరి అలా నడిచినప్పుడు కాళ్ళు కాలవా అని ఎప్పుడొకప్పుడు మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా..!?
నిప్పుల మీద నడిచినప్పుడు కాళ్లు ఎందుకు కాలువు అంటే..
* మన శరీర భాగాల్లో ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి మన పాదాలకు ఉంటుంది.
* ఇక నిప్పుల గుండం కోసం వాడే నిప్పు కోసం బొగ్గును వాడతారు. ఈ బొగ్గు మంచి “ధర్మల్ ఇన్సులేటర్” గా పని చేస్తోంది.
దీనిపైన ఏర్పడిన బూడిద వల్ల కాళ్ళు కాలకుండా ఉంటాయి. ఆ బొగ్గులపై నుండి కూడా ప్రత్యేకంగా బూడిద చల్లుతారు. దీని వల్ల కూడా ఉష్ణోగ్రత అనేది బయటకు రాకుండా ఉంటుంది.
అలాగే నిప్పుల గుండం మీద నడిచేవాళ్ళు మెల్లిగా కాకుండా, వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అందువల్ల కాళ్ళు కాలడం తక్కువగా ఉంటుంది.
అమెరికన్ సైంటిస్టులు స్వయంగా దీనిమీద ప్రయోగాలు కూడా చేసారు. వాళ్ళు కూడా నిప్పుల గుండం ఏర్పాటు చేసుకొని దానిమీద నడిచి చూసారు.. వాళ్లకు కిడా కాళ్ళు కాలలేదట.