Janasena Party Politics : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యం గా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన జనసేన టీడీపి పొత్తు పై కొనసాగుతున్న ఊహగానాలకు త్వరలోనే ముగింపు పలికే దిశలో రణ స్థలం సభా వేదిక గా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తమకు గౌరవనీయ స్థానాలు మరియు అధికార భాగస్వామ్యం ఇస్తే పొత్తుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులు కు దిశానిర్దేశం చేసారు. ఈ ప్రకటన తర్వాత ఒక్కసారి గా రాజకీయాలు వేడెక్కాయి.
రంగంలోకి దిగిన మంత్రులు జనసేన పై వరస ఆరోపణలు గుప్పించారు. అంతకు ముందు నుంచీ స్వయంగా దత్త పుత్రుడు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడటం వెనుక అంతర్గతంగా కూడా ఒక విధమైన వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా.
Also Read : జగన్ కి పవన్ లేఖ..
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్ల అనుకున్న స్థాయిలో సానుకూలత రానందున
అభివృద్ధి పేరుతో ప్రతిపక్ష పార్టీల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది.రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ దిగజారడంతో నష్ట నివారణ చర్యలకు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
టీడీపీ జనసేన పొత్తు సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ప్రాధమిక అంచనా కు ప్రభుత్వం రావడానికి కారణాలు ఉన్నాయి. దాదాపుగా సగానికి పైగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జనసేన పార్టీకి అండగా ఉండటం, పటిష్టమైన నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య పాత్ర పోషించడం వల్ల వందకు పైగా స్థానాల్లో సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు అంచనా.
Also Read : YCP గెలుపు గాలివాటమేనా..?
ఎట్టి పరిస్థితుల్లో టీడీపి వైపు జనసేన ను వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో కేంద్రం ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో గట్టి పోటీ అయితే తప్పదని భావించ వలసి వస్తోంది. ప్రతి పక్షాల ఏకీకరణ చేసే క్రమంలో చంద్రబాబు వ్యూహం ముందు వైసీపీ నేతల భవిష్యత్ పై ఆందోళన మొదలైంది. ఈ పొత్తు ప్రభావం వల్ల సర్కార్ కు గండం తప్పదని సొంత పార్టీ నేతలే వ్యక్తిగత సంభాషణల్లో వాపోవడం గమనార్హం.