Janasena Varahi Vehicle : ఇలా చేస్తే వారాహిని ఆపడం ఈజీనే..!!
అసలు ఆ వాహనానికి పర్మిషన్ ఎలా వస్తది..? మా స్టేట్ రోడ్ల మీద ఎలా తిరుగుద్ది..? దాని సంగతి చూస్తాం ముందు ఇక్కడ అడుగు పెట్టమనండి.. అని మనం సవాళ్లు విసిరితే “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ వాళ్ళు రెచ్చి పోయారు. అసలు రిజిస్ట్రేషన్ కూడా అవదు అని మనం తీర్పులు కూడా చెప్పాక.. దానికి రిజిస్ట్రేషన్ తో పాటు అన్ని పనులూ కంప్లీట్ అయి బండి రోడ్డెక్కడానికి రెడీగా ఉందని తెలిసి బకరాలు అయ్యాం.. అక్కడితో ఆగితే పోయే.. అసలు అక్కడి రూల్స్ వేరు.. ఇక్కడి రూల్స్ వేరు..అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఎలా తిరుగుతారు అంటూ బుర్ర తక్కువ ప్రశ్నలు వేసి మరోసారి బకరాలు అయ్యాం..
ఫైనల్ గా అదేమో సల్లగా కొండగట్టు దగ్గర పూజ ముగించుకుని.. లక్ష పుస్తకాలు చదివావ్ రూల్స్ తెలీదా అంటూ మనం చెప్పిన లా పాయింట్స్ సాక్షిగా మన స్టేట్ కి వచ్చి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుంది. పొడిచేస్తాం.. చించేస్తాం.. అన్న మనకు మూడోసారి భంగపాటు తప్పలేదు.. మనం రూల్ ప్రకారం పోతే దాన్ని ఏమీ చేయలేం అని అర్ధం అయింది. ఇక మనం దాన్ని ఆపాలంటే మనకు ఇక ఒకటే దారి..
నైట్ పూట దాన్ని ఏ పక్కనో పార్క్ చేసినపుడు మెల్లగా వెళ్లి దాని గాలి తీసేయడమో.. లేక దాని టైర్లు ఊడదీసి ఎత్తుకొచ్చేయడమో.. అదీ కాకపోతే మూడు రంగుల డబ్బాలు పట్టుకెళ్లి ఎవడూ చూడకుండా దానికి రంగులు వేసి వచ్చేయడమో.. లేక అది ఉన్న ఏరియాలో మనం అధికారం లో ఉన్నన్నాళ్ళూ లాక్ డౌన్ పెట్టేయడమో.. అదీ అవకపోతే మనం డబ్బులిచ్చి ఎప్పుడూ బురద జల్లించే ఆ డైరెక్టర్ పరాన్న జీవిని దాని ముందు పడుకోబెట్టినా పనవుద్దేమో..ఫైనల్ ఇవన్నీ కాకపోతే వారాహికి వల్ల రోడ్డు మీద చీమలు చనిపోయి జీవ హింస జరుగుతుంది ఇదంతా వారాహి మీద పవన్ కళ్యాణ్ రోడ్డు మీద తిరగడం వల్లే అని పశుసంవర్ధక శాఖా మంత్రి గారితో నాలుగు ప్రేస్మిట్లు పెట్టించి ఖండ ఖండాలుగా ఖండించొచ్చు ఏమో ఆలోచించండి..
(Note : ప్రస్తుతం AP రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలతో చాలా హాట్ హాట్ గా ఉన్నాయి.. సోషల్ మీడియా అయితే ఎప్పుడూ మంచి గరం గరం గా ఉంటుంది.. కొంతమంది విమర్శలు చాలా ఘాటుగా నాటుగా ఉంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి.. ఇపుడు మీరు చూసింది కూడా అలాంటి ఫన్నీ పోస్టే..ఇది జస్ట్ ఫన్ కోసమే..)