Karachi Lake : మనకు సరస్సులు కానీ నదులు కాని కనిపిస్తే ఏం చేస్తాం వెంటనే నీళ్లలోకి దిగిపోయి సరదాగా ఆ నీళ్లలో ఆటలాడుతాం..కదా.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోపోయే సరస్సు నీళ్లలో దిగడం కాదు,దాని ఒడ్డున నిలుచుంటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. మనం మాట్లాడుకోపోయే సరస్సు ఎక్కడ ఉంది.. దాని విశేషాలు ఏమిటో.. ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.
మనం చెప్పుకున్న అత్యంత ప్రమాదకరమైన సరస్సు పేరు కరాచే. ఇది రష్యా పశ్చిమప్రాంతంలోని ఫెడరేషన్ ఆఫ్ షెల్యాబిన్‌స్క్‌లో దక్షిణ యూరల్ పర్వత సానువుల దగ్గరలో ఉంది. ఈ సరస్సు కేవలం 900 మీటర్ల పొడవు మాత్రమే కలిగి ఉంటుంది. దీని ఆకారం కాస్త విచిత్రంగానే కనిపిస్తుంది. ఒకచోట సన్నగా మరోచోట వెడల్పుగా ఉంటుంది. అధిక వెడల్పు గల ప్రాంతంలో ఈ సరస్సు కేవలం 500 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది.
ఇంత చిన్న సరస్సు పక్కన ప్రాణాలు ఎలా కోల్పోతాము అని అనుమానం మీకు కలగవచ్చు. ఈ సరస్సు ఒడ్డున నిల్చున్న చాలా ప్రమాదకరమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సరస్సు పూర్తిగా రేడియోధార్మిక వ్యర్థాలను కలిగి ఉంది. ఈ సరస్సు ఇలా ఉండడానికి కారణం, కొంతకాలం క్రితం ఈ సరస్సు పక్కనే అణుకేంద్రం ఉండేది. అక్కడ వ్యర్థాలన్ని వచ్చి ఈ సరస్సులో కలిసేవి. ఇవి చాలా అత్యంత ప్రమాదకరమైనవి.
ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత గల సరస్సుగా కరాచే 1951లో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. వాస్తవానికి గతంలో ఈ సరస్సు 24 గ్రామాలకు మంచినీటి వనరుగా ఉండేది. కానీ కాలక్రమేన విషవాయువులతో నిండిపోయింది. దీంట్లో అణ్వాయుధాల్లో ఉపయోగించే, అణుకేంద్రం నుంచి వెలువడిన ప్లూటోనియం-239, యురేనియం-235, ఐసోటోప్స్ ఈ సరస్సులోకి చేరడంతో అందులోని నీళ్లు మొత్తం విషంగా మారాయి.
అమెరికా శాస్త్రవేత్తలు 1992లో చేసిన పరిశోధనలో ఈ సరస్సు ఒడ్డున గాలిలో రేడియోధార్మికత ప్రభావం అధికంగా ఉందని, దానివల్ల 5.6 సీట్ల రేడియో ధార్మిక ప్రవాహానికి అక్కడికి గాలి లోనయ్యే ప్రమాదం ఉందని, దానివల్ల మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని కాలక్రమేన అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇక అప్పటినుండి ఆ సరస్సు పక్కన ఉన్న గ్రామాలలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.