తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నా క్రేజ్ గురించి తెలిసిందే. కేవలం సినిమాలతోనే కాదు వ్యక్తిత్వం, మంచితనం, సేవాగుణంతో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఓ నూతన పెళ్ళిజంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ నవ వధూవరులు ఏం చేశారంటే.. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలాజీరావు పేటకి చెందిన మాన్యం జగదీష్ కి , రమ్య అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది.
అయితే నేరుగా తమ పెళ్ళికి పవన్ కళ్యాణ్ రాకపోయినా, ఆయన సమక్షంలో పెళ్లి చేసుకోవాలని జగదీష్ ముచ్చట పడ్డాడు. పట్టణంలోని ఎన్జీవో కళ్యాణ మండపంలో పెళ్లి సందర్భంగా అభిమాన నవ దంపతులు పవన్ కళ్యాణ్ ఫోటోని వారి మధ్యలో వేయించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా బ్యానర్ పై “మన దేవుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ” అని రాయించారు. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీ లో ” మనల్ని ఎవడ్రా ఆపేది” అనే డైలాగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పవర్ స్టార్ కి వీరాభిమానులు కావడంతోనే పెద్దలకు చెప్పి, ఒప్పించి ఈ విధంగా చేసారని వారి బంధువులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ని దేవుడితో సమానంగా భావించి ఆరాధిస్తామని, జనసేన అభిమానులుగా పెళ్లిలో గుర్తుండి పోయే విధంగా ఉండాలని తమ మధ్య పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నామని ఆ జంట చెబుతున్నారు.