అధికార పక్షం, ప్రతిపక్షం “60-40 ఒప్పందం” అనే టాక్ ఉంది. అంటే బయటికి ఎన్ని తిట్టుకున్నా వెనక మాత్రం వీళ్లిద్దరూ ఒకటే అనేది చాలామంది ప్రజల భావన. అందుకే ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవర్ని ఎవరు చేసేది ఏమీ ఉండదు. పైపెచ్చు మంచి సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారనేది వాస్తవం. బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన ఓ ఉదాహరణ.. బాలకృష్ణను వైయస్ కాపాడారని సాక్షాత్తు లక్ష్మీపార్వతి స్వయంగా చెప్పారు.
ఇప్పుడు తాజా రాజకీయం చూస్తుంటే వయసు అయిపోయి.. జనం నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు.. పార్టీకే భారం అనిపించుకున్న చిన బాబు.. వీళ్ళ వలన ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది.. ఇక్కడే మూడో ప్రత్యామ్నాయం జనసేన బి.జె.పి కూటమి ప్రజల్లో నమ్మకాన్ని పొందుతున్న తరుణంలో మీడియాను చేతిలో పెట్టుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు తమ గేమ్ స్టార్ట్ చేశాయి. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అనేది లేకుండా తమ ప్రత్యర్థులను తామే ఎంచుకునే రాజకీయ చదరంగ ఎత్తుగడలో భాగమైన ఒక గొప్ప వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి..
ఒకసారి గతం గుర్తు చేసుకుంటే.. రాజశేఖర రెడ్డి ఉండగా ప్రజలకు అంతగా తెలియని జగన్ మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా బయటకు లాగి లక్షల మందికి పరిచయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరియు అతడి అను”కుల” మీడియానే.. పదేపదే జగన్మోహన్ రెడ్డి పేరున ప్రస్తావిస్తూ టీడీపీ చేసిన ప్రయత్నం వల్లనే జగన్ ఇంత పాపులర్ అయ్యాడు. అపర చాణిక్యుడు గా పేరున్న చంద్రబాబుకి తానే జగన్ ని పాపులర్ చేస్తున్నాననే చిన్న విషయం తెలియదు అంటారా ?
ఇప్పుడు కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది. వయోభారం వల్ల పార్టీ పగ్గాలను చినబాబు చేతికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించిన చంద్రబాబుకి.. చినబాబు పట్టుమని పది రోజులు కూడా ప్రజల్లోకి వెళ్ళకముందే వైసీపీ మీడియా నుండి చక్కని సహకారం లభిస్తుంది.. ఇక్కడ సహకారం అంటే ప్రొజెక్ట్ చేయడం అనే విషయాన్ని గ్రహించాలి. అతడొక అయోమయం, దేవాలయం బాపతు అంటూ ఎద్దేవా చేసినట్లే చేస్తూ.. రోజుకొకరు చొప్పున లోకేషని ఎద్దు, మొద్దు అంటూనే లోకేష్ టూర్ కి పూర్తి కవరేజ్ ఇచ్చారు..
వీళ్ళకు తోడు ఎల్లో మీడియా ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు కి లోకేష్ చేతి వాచ్ చూపిస్తున్న ఫోటోనే మెయిన్ ఎడిషన్ లో వేసి ఒక ఆర్టికల్ ని వండి వార్చగల తెలుగుదేశం అనుకూల మీడియా లోకేష్ బయటకు వస్తే ఆగుతుందా? మెయిన్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ డప్పు కొట్టడం స్టార్ట్ చేసి వండి వార్చిన కథనాలను ప్రజలలోకి చొప్పించడం మొదలు పెట్టింది. పది రోజులుగా ఇరు పార్టీల అనుకూల మీడియా లు చినబాబు పేరు మారుమ్రోగించాయి..
మీడియాని చేతిలో పెట్టుకున్న ఈ రెండు పార్టీలు ఎక్కడా మూడో పార్టీ అనే ఊసు లేకుండా పొలిటికల్ గేమ్ ఆడుతూ అయితే టీడీపీ లేక పోతే వైసీపీ మాత్రమే ప్రజలకు దిక్కు అనే ఈ విధంగా పబ్లిక్ ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాయి. పైకి విమర్శలు చేసుకుంటూ వెనుక వాళ్లలో వాళ్లకి పూర్తిగా సహాయ సహకారాలు అందించుకుంటూ సంవత్సరాలుగా ప్రజలను పిచ్చివాళ్లని చేస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం.