Million March:మిలియన్ మార్చ్ కి నేటితో 12 ఏళ్ళు
అన్నం లేదు.. నీళ్ళు లేదు.. పనీ లేదు.. పాటా లేదు…రాజకీయం లేదు..కులం, మతం అస్సలే లేదు
ఉన్నది ఒక్కటే.. “నా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం” గావాలె అన్న పట్టుదల మాత్రమే. ప్రత్యేక తెలంగాణా కోసం చిన్నా పెద్ద, ముసలి ముతకా, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు అని కూడా ఏ బేధం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల గలవారు మూకుమ్మడిగా ఒక్కటై నినదించిన స్వరం “జై తెలంగాణా”. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు, మరెన్నో ఆత్మహుతి చావులు. ధర్నాలు రాస్తారోకోలతో ఎట్టకేలకి సాధించిన రాష్ట్రం “తెలంగాణా”.
రాష్ట్రం ఊరికే రాలేదు, తెలంగాణా ప్రజల ఉద్యమ ఉదృతి చూసి కేంద్రమే దిగి వచ్చి ఇవ్వక తప్పని పరిస్థితి ఆ సమయంలో. అలాంటి సమయంలో ప్రత్యేక రాష్ట్రం రావడంలో కీలక భూమిక పోషించిన “మిలియన్ మార్చ్” కార్యక్రమానికి నేటితో సరిగ్గా 12 ఏళ్ళ సందర్బంగా మరొక్కసారి గుర్తు చేసుకుంటుంది తెలంగాణా ప్రజానీకం..
ఆనాడు 2011 మార్చి 10 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం కోదండరాం నేతృత్వం లోని JAC ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగులు,ప్రజలు, విద్యార్థులు,విద్యార్థి సంఘాలతో పాటు కవులు, రచయితలు మేధావులు అందరూ పాల్గొని, ప్రత్యేక రాష్ట్ర ఆవష్యకతను తెలియజేశారు తెలంగాణా ప్రజలు. ఆ తదనంతరం తెలంగాణా వచ్చిన సంగతి తెలిసిందే.