MLC Election Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల విజయం టీడీపీ ఆధికార పగ్గాలను అందిస్తుందా?
ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందగా, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రతో సహా రెండు రాయలసీమ నియోజక వర్గాల్లోనూ టీడీపీ గెలిచింది. పీడీఎఫ్ తో చేసుకున్న అవగాహన కలిసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. సాధారణ ఎన్నికలకు భిన్నం, సంక్లిష్టత తో కూడిన ప్రకియ . రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలుపు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు ఆని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం వాపుని చూసుకొని మురిసిన చందంగా వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో సరైన గుణపాఠం చెప్పారని టీడీపీ నాయకుల సంబరాలు జరుపుకొన్నారు.. వచ్చిన ఫలితాలలో టీడీపీ గెలుపు కళ్ళముందు కనబడుతున్నా ఇదే తరహా ఫలితాలు సాధారణ ఎన్నికల్లో వస్తాయని భావించడం తోందరపడి కోయిల ముందే కూసిన విధంగా వుంది. ప్రభుత్వ వ్యతిరేకత వున్న మాట వాస్తవం, రాజధానిపై కూడ ఈ ఎన్నికల్లో స్పష్టత వచ్చింది అనేది కొంతవరకూ నిజం. అత్యున్నత న్యాయ స్దానంలో ఈ విషయం విచారణలో ఉన్న సమయంలో అధికార పక్ష ప్రకటనలు ఒక్కింత వారిని ఇబ్బంది కలిగించే ఆంశం. కోర్టు తీర్పు వచ్చేవరకూ సమ్యమనంతో వ్యవహరిస్తే అధికార పక్షానికి మంచింది.
ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..ఆ పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేయలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఏ పార్టీకి వేయాలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తో అవగాహన కుదుర్చుకుంది. రెండో పాధాన్యత ఓటు తమకు బదిలీ అయ్యేలా చేసుకున్న ఒప్పందం కలిసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీ గెలుపులో కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి అధికారంతో సహకారం లేకపోయినా..టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు మాత్రం తమ విజయంలో పవన్ కు భాగస్వామ్యం కల్పించారు. పవన్ పిలుపు మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ అభ్యర్ధి విజయానికి దోహదపడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు ప్రకటన లాంఛనం:
ఇక..అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా భావిస్తున్నారు. టీడీపీ -జనసేన పొత్తు షరతులతో కూడుకున్నదా లేదా స్పష్టత రాలేదు. మచిలీపట్నం సభలో చేసిన ప్రకటలో సైతం పొత్తులపై స్పష్టతలేదు. టీడీపీ -జనసేన పొత్తు పై త్వరగా స్పష్టత రావాలి. బి.జె.పి ఇంకా పవన్ మాతోనే ఉన్నారు అన్న భ్రమని ప్రజల్లో కల్పిస్తోంది. సామాన్యుని స్దాయిలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచు కోవాలంటే ఎంతో కసరత్తు చెయ్యాలి. పొత్తులపై స్ఫష్టత , అభ్యర్దుల వివరాలతో పాటు ఎన్నికల కార్యాచరణ హామిలపై కసరత్తు చేసి ముసాయిదా సిద్దంచెయ్యాలి. టీడీపీ కూడ త్యాగాలకు సిద్దం కావాలి. టీడీపీ లో నాయకుల మధ్య సమన్వయం పూర్తి స్దాయిలోలేదు. అదిశగా అధినేత చొరవచూపాలి. జనసేన కూడ మీనమేషాలు లెక్కించకుండా పొత్తు లపై స్పష్టత ఇవ్వాలి ఒంటరి పోరు ఇరువురికి నష్టం. ఆధికారపక్షానికి లాభం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి. పట్టభద్రులు , ఉపాధ్యాయులకు ఉన్న పరిణితి , యువకులకు, సామాన్యులకు, నిరక్షరాస్యులకు ఉండదు వారిని ఆకర్షించేవి ప్రలోభాలు , పైసలు జమచేసే ప్రభుత్వ పధకాలు కాబట్టి వారికి భరోసా, ధైర్యం కల్పించాలి. మేము ఆధికారం లోకి వస్తే అధికారులపై పోలీస్ వ్యవస్దపై ప్రతీకారం తీర్చుకుంటాం అన్న భావనతో టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రకటనలు ప్రభావం చూపుతాయి సమ్యమంతో మాట్లాడి ఓటు బ్యాంకు ని తమకు అనుగుణంగా మలుచుకోవాలి. ప్రాంతీయంగా నెలకొన్న పరిస్దితులు అనేక రకాల సమీకరణాలు సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఉపాధ్యాయ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికల ఫలితాలకు దిక్సూచి గా భావించలేం కాని ఈ ఫలితాలు కొంతమేర పార్టీల గెలుపు ఓటములపై పాక్షిక ప్రభావాన్ని చూపుతాయి.
శ్రీధర్ వాడవల్లి – హైదరాబాద్