గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం అవతలోడు కాలిపోతుంటే అది చూస్తూ పైశాచిక ఆనందం పొందడం ఇదే నేటి మీడియా సంస్థల ధోరణి గా మారింది. తమ సంస్థల మనుగడ కోసం ఎంతటి వారి పైన అయినా నిందలు మోపి బజారు కు లాగడం సాధారణ విషయంగా మారింది.
తాజాగా మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల ముందుకు వచ్చిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీని విడిచి వెళుతున్నారని, వైసీపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారని కొన్ని వెబ్ సైట్లు రాసుకుంటూ వస్తున్నాయి. దీనిపై మనోహర్ సన్నిహిత వర్గాలను సంప్రదించగా నాదెండ్ల పై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 20 లక్షల ఓట్లు సాధించిందని అందులో అధిక భాగం యువత అని, అలాంటి యువత ఆశలు మోస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు నచ్చి నాదెండ్ల పార్టీలోకి వచ్చారని అలాంటి వ్యక్తి ప్రలోభాలకు లొంగే ప్రసక్తేలేదని, పార్టీ వ్యతిరేక వర్గాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.
అంతేకాక నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఇటీవలే నదుల పరిరక్షణ కోసం చేపట్టిన మన నుడీ-మన నదీ కార్యక్రమంలో పాల్గొన్ని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని, అంతేకాక నిన్ననే మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని, ముఖ్య నాయకులతో సమావేశమై భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారని, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం పై విమర్శించిన మనోహర్ పార్టీ వీడుతున్నారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.