Nasa warns solar storm : ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. దాంట్లో భూమి ముఖ్య భూమిక. భూమి అంతం గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం కూడా భూమి అంతం గురించి ప్రస్తావించింది. ఆ విషయాలు ఇప్పుడు నిజం చేసేలా కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నాసా భూమి అంతం గురించి కొన్ని హెచ్చరికలు చేస్తుంది. ఈ విషయంలో నాసా చెప్పేది చాలా మంది విశ్వసిస్తారు.
అంతరిక్షంలో తుపాను రాబోతుందని నాసా అంచనా వేస్తుంది. అంతరిక్షంలో ఇంతకుముందు తుఫానులు రాలేదా అంటే చాలానే వచ్చాయి. కానీ ఈసారి రాబోతున్న తుఫాను మాత్రం చాలా నష్టాలను తీసుకువస్తుందని నాసా అభిప్రాయపడుతుంది. ఈ తుఫాను ప్రభావం భూమిపై కూడా ఉంటుంది అని నాసా అభిప్రాయపడుతుంది.
సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రంలో కదలికలు జరుగుతున్నప్పుడు అది చాలా శక్తివంతమైన రేడియేషన్ అంతరిక్షంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. దీనిని సౌర గరిష్టం అని పిలుస్తారు. అది భూమి వైపు వేగంగా కదులుతుందని నాసా చెపుతుంది. అంతరిక్షంలో వస్తున్న ఈ తుఫాను కారణంగా భూమిపై విద్యుత్ వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తుంది.
అలాగే అంతరిక్షం నుంచి వచ్చే అనేక ఉపగ్రహాలు కూడా దీనివల్ల క్రాష్ అయ్యే అవకాశం ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం సౌర తుఫాను వచ్చినప్పుడు ఎండలో బీకర పేలుళ్లు సంభవిస్తాయని, ఒకోసారి ఈ తుఫాను సమయం కంటే ముందే వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.