ఉదయం లేవగానే వాకింగ్ లో నీ పాటతోనే రోజు మొదలు అవుతుంది..
స్నానం చేసేప్పుడూ.. బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడూ.. అసలు చేసే ప్రతి పనిలోనూ నీ పాట తలచుకోని సమయం ఉంటుందా?
ఆఫీస్ కి వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు బస్ లో నీ పాటలే..
ఆఫీస్ లో కాస్త చిరాగ్గా ఉంటే నీ పాటతో ఓ కప్ కాఫీ తో కాస్త రిలీఫ్ ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో..
ప్రేమలో ఉన్నప్పుడు హుషారు నీ పాటలే..
అదే ప్రేమ వికటించినపుడు ఓదార్పు కూడా నీ పాటలే..
నీ పాట వింటూ ఈ సముద్రం ఒడ్డున కూర్చొన్న సాయంత్రాలు ఎన్నో..
ఉన్న ఉద్యోగం పోయినప్పుడు నీ పాటే ఓ ధైర్యం..
ఓ సంతోషం అయినా.. కవ్వింత అయినా.. తుల్లింత అయినా వెతికేది నీ పాటే..
జానపదం అయినా.. మా జ్ఞానపదం అయినా నీ పాటలే బాలూ..
ఏ సాయంత్రం గుడికి వెళ్లినా ఆ భక్తిలోనూ నీ పాటే..
చివరికి రాత్రి పడుకోబోయే మందు జోల పాట కూడా నీ పాటే..
మా జీవిత గమనంలో నువ్వు లేనిది ఎక్కడ..??
మా బాధలో.. నీ అమృతపు ఓదార్పు సాంత్వన లేనిది ఎప్పుడు??
స్కూల్..కాలేజ్ రోజుల్లో నీ పాట వినని రోజు ఎక్కడిది??
మా జీవితపు ప్రతీ అడుగులో.. ప్రస్థానంలో నువ్వే ఉన్నావ్ కదా..
ఇంకా నువ్ లేనిది ఎక్కడ..?
ఎవరు కాస్త అలిసినా నీ గాత్రం తో సేదతీర్చీ.. సేదతీర్చీ.. నువ్ అలసిపోయావ్..
విశ్రాంతి తీసుకోవయా..
ఓ బాలూ లాలీ..!!
Anil Kumar Pagidimarri