Oscar Awards 2023 : ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ ఆస్కార్. ఆ అవార్డ్ సొంతం చేసుకోవాలని ఇండస్ట్రీలో ప్రతిఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ యేడాది ప్రపంచం నలుమూలల నుండి అనేక సినిమాలు ఆస్కార్ కోసం పోటీపడుతుండగా అందులో టాలీవుడ్ నుంచి RRR మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆస్కార్ వేడుకలు మార్చి 12న అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్ని డాల్బీ థియేటర్లో అంగరంగా వైభవంగా జరగనున్నాయి.
ఈ వేడుకలను భారత కాలమానం ప్రకారం సోమవారం 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు IST ప్రత్యేక్ష ప్రసారంలో మనం చూడవచ్చు. Academy of Motion Picture Arts and Sciences (AMPAS) వారు మొదటిసారిగా May 16, 1929 లో ఈ అవార్డ్ ను అందజేశారు. అయితే 1939 నుంచి ఈ అవార్డు పేరు ఆస్కార్ గా పిలవబడింది. ప్రతి సంవత్సరం సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్ ను అందజేస్తున్నారు.

ఆస్కార్ ప్రతిమను శిల్పి జార్జి స్టాన్లీ, పదమూడున్నర అంగుళాలా ఎత్తు, ఎనిమిది పౌండ్ల బరువుతో చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లోహ కొరత ఏర్పడింది. అప్పుడు మూడేళ్ళ పాటు ఆస్కార్ ప్రతిమలను పెయింటెడ్ ప్లాస్టర్ తో తయారు చేసి అందజేశారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రతిమను వెనక్కు తీసుకొని లోహపు ప్రతిమలు ఇచ్చారు.
50 ఆస్కార్ ప్రతిమలను చెయ్యడానికి మూడు నెలలు సమయం పడుతుంది అని ఆస్కార్ నిర్వాహకులు పేర్కొన్నారు. అంతేకాదు 2000వ సంవత్సరంలో 55 ఆస్కార్ అవార్డులు దొలిగిలించబడ్డాయి. ఈ ఏడాది 95వ ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవం జరుగుతుండగా వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ లైవ్ లో పాడనున్నారు. ఈ అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
