Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కానీ, ఇప్పుడు? ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ హీరో, అభిమానులకు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడు నుంచి పవర్ స్టార్‌గా ఎదగడం వెనుక మెగా వారసత్వం ఒక్కటే లేదు.
హీరోగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఉంది. కథల ఎంపికలో చూపించిన వైవిధ్యం ఉంది. ఇటు రాజకీయంగానూ ప్రస్తుతం పవన్ దూసుకు పోతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే.. అధికార పక్షానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సినిమాలను, రాజకీయాలను బాలన్స్ చేస్తూ పవన్ తన అభిమానులకు మరింత చేరువయ్యాడు.
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, వినోదాయ సీతం, ది ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ ను ప్రశంసిస్తున్నారు. వీళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ బలం అని కామెంట్ చేస్తున్నారు. పవన్ సినిమా కథల ఎంపిక విషయంలో త్రివిక్రమ్ సహాయపడుతున్నారు.
మొన్న భీమ్లా నాయక్, నేడు వినోదాయ సీతం స్క్రిప్ట్ లోనూ త్రివిక్రమ్ ఉన్నారు. మరోవైపు పవన్ షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారు.
పవన్ కు త్రివిక్రమ్, నాదెండ్ల సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉందని వాళ్లిద్దరూ పవన్ కు కెరీర్ పరంగా చాలా మేలు చేస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. పవన్ సేవాగుణం, నిరాడంబరత, తెగింపు ఆయనకు రోజురోజుకీ మరింతమంది అభిమానులను సంపాదించి పెడుతుంది. చివరకు ఎలాగైనా జనసేన ఏపీలో అధికారంలోకి రావాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు.