Pawan kalyan: పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కానీ, ఇప్పుడు? ఆయనొక అగ్ర కథానాయకుడు, అభిమానులకు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడు నుంచి పవర్ స్టార్‌గా ఎదగడం వెనుక మెగా వారసత్వం ఒక్కటే లేదు. హీరోగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఉంది. కథల ఎంపికలో చూపించిన వైవిధ్యం ఉంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి భీమ్లా నాయక్ వరకూ పవన్ కళ్యాణ్ 27 సినిమాలు చేశారు. అందులో విజయాలు, అపజయాలూ ఉన్నాయి. అయితే… హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే అనడం అతిశయోక్తి కాదు. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఆయన మార్కెట్ తగ్గలేదు. సినిమా సినిమాకు పెరిగింది. హిట్ పడినప్పుడు మరింత పెరిగింది.
Also Read : హరిహర వీరమల్లు లో బాలీవుడ్ హీరో..
ఒక్క మాటలో చెప్పాలంటే… పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ ఫ్లాప్‌లతో కట్టిన కోట. పవర్ స్టార్ కంటే ఆయన్ను ఎక్కువగా ప్రేక్షకులు ప్రేమించడం వెనుక సినిమాలు మాత్రమే లేవు. ఆయన సింప్లిసిటీ, పర్సనాలిటీ ఉన్నాయి. ప్రేక్షకుల ముందు ప్రత్యేకంగా నిలిపాయి.
ఇటు రాజకీయంగా ప్రస్తుతం పవన్ దూసుకు పోతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే.. అధికార పక్షానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సినిమా, రాజకీయాలను బాలన్స్ చేస్తూ పవన్ తన అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇదిలావుండగా ఫ్యాన్స్ లో పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో రుజువైంది.
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో నిర్వహించిన ప్రభల ఊరేగింపుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన హీరో కటౌట్లతో ప్రభలు తయారు చేసి, ఊరేగించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇది’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.