ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టి జగనన్న విద్యా కానుకకి వందశాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఖర్చుచేస్తుంది అని చెప్పి 24 గంటల పూర్తి అవ్వకుండా అసలైన పూర్తి వివరాలతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షేర్ ఎంత, కేంద్రం షేర్ ఎంత ఖర్చు అవుతుందో ఫోటోలో పొందుపరిచారు వివరించారు పవన్‌కళ్యాణ్.
పైగా ‘జగనన్న కానుక’ అనే కంటే “మోదీ-జగనన్న కానుక” అంటే బాగుంటుంది అంటూ చమత్కరించారు పవన్‌కళ్యాణ్. ఈ పధకం అమలుకు కేంద్రం 60% నిధులు ఇస్తుంటే రాష్ట్రం 40% ఇస్తుంది అని అన్నారు పవన్ కళ్యాణ్.
పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లు, యూనిఫాం లు, బెల్ట్ మొదలగు అన్నింటికి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా ట్వీట్ లో పొందుపరిచారు.
అయితే నిన్న విద్యాశాఖ మంత్రి వివరిస్తూ కేంద్రం యూనిఫాంలకి 100 కోట్లు మాత్రమే ఇచ్చింది అని, మేము మూడు జతలు మరియూ యూనిఫాం కుట్టు చార్జీలు నిమత్తం జతకి 40/- రూపాయలు చొప్పున 120/- రూపాయలకు విద్యార్థులు తల్లుల ఖాతల్లోకే జమచేసాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ విద్యాశాఖమంత్రి లెక్కలపై కేంద్రం కానీ బిజేపి నాయకులు ఖండించకపోయినా జనసేన అధినేత మాత్రం పూర్తి లెక్కలతో వివరించండంతో వైసిపి ప్రభుత్వం ఇరుకున పడినట్టు అయింది.
ఈ ట్వీట్ వల్ల వైసిపి కార్యకర్తలు కూడా ఖంగుతిన్నారు.. వాళ్ళ అంచనా ప్రకారం జగన్ పేరు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఎప్పటిలాగే టిడిపి ప్రభుత్వంలో ఏమ్ చేశారు అని వితండ వాదం చెయ్యొచ్చు అని భావించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వల్ల వాళ్ళు మోడీ పేరు ఎందుకు పెట్టాలి అని ప్రశ్నిస్తే జగన్ పేరు ఎందుకు పెట్టాలి అన్న ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. లేదా ఎవరి పేరు లేకుండా దేశ భక్తుల పేర్లు పెట్టాలి అన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని అయినా ఒప్పుకోవాలి. ఇప్పటికే గత ప్రభుత్వం పై పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టడంపై ఎమ్మెల్యే రోజా,అంబటి లు చేసిన వ్యాఖ్యలు ఇప్పటి ప్రభుత్వం తీరుకి కూడా అతికినట్టు ఉండటంతో అవి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంత మంది అయితే వాళ్ళు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. దీనిమీద ప్రభుత్వం కానీ వైసిపి నాయకులు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.