Pigeon : ఇప్పుడు మనం ఏదైనా సమాచారాన్ని చేరవేయాలంటే క్షణాలలో పని. ఆ రకంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ముఖ్యంగా మాట్లాడుకోవడమే కాకుండా, ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటూ కూడా మాట్లాడుకునే విధంగా వీడియో కాల్స్ చేసే అంత టెక్నాలజీతో ముందంజలో ఉన్నాము. కానీ మన పూర్వీకులు సమాచారాన్ని చేరవేయాలి అంటే ఏ రకమైన పద్ధతులను ఎంచుకునేవారు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజుల కాలంలో సమాచారం మార్పిడి కోసం, ఉత్తరాలను పంపించడం కోసం, పావురాలకు కట్టి పంపించేవారు. ఇది మనం చాలా సినిమాలలో కూడా చూశాము. కానీ నిజంగా రాజుల కాలంలో ఈ పద్ధతినే అవలంబించేవారు. మరి పావురాలు కరెక్టుగా అనుకున్న స్థానంలోకి ఎలా సమాచారాన్ని తీసుకువెళ్లేవి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా. అలాంటి అనుమానం కలిగిందా? పావురాలు మాత్రమే ఇలా సమాచారాన్ని ఎలా తీసుకెళ్లగలవు. దాని వెనకాల ఏదైనా సైంటిఫిక్ రీసన్ ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికి ప్రధాన కారణం ఒక్కటే అని చెప్పవచ్చు. పావురాలకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. అవి ఒక ప్రయాణం మార్గాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని అవి ఎప్పటికీ మర్చిపోవు. అందుకే ఉత్తరాలను, సమాచారాన్ని పంపించేందుకు రాజుల కాలంలో పావురాలను ఎంచుకునేవారు. పావురంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ జిపిఎస్ మాదిరిగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది.
దీని కారణంగానే పావురం తాను ప్రయణించిన మార్గాన్ని అస్సలు మరిచిపోదు. పావురాలు కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు మాగ్రెటోరిసెప్షన్ అనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఒక నివేదిక ఆధారంగా బయటపడిన విషయం ఏమిటంటే పావురం శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాల సమూహం ఉంటుందని తేలింది. పావురం దిశను గుర్తించడంలో సహాయపడేవి ఈ కణాలేనంట.
అచ్చంగా మనుషుల్లాగానే పావురాలు కూడా తమ దృష్టి ద్వారా దిశలను సులభంగా గుర్తించేస్తాయి. పావురం కళ్ళలోని రెటీనాలో ఒక ప్రత్యేక కారణంగానే దృష్టి బాగా ఉంటుందని అధ్యయనాలు తేలింది. పావురాలను ఉత్తరాల పంపించడానికి ముఖ్య కారణాలుగా నిపుణులు వీటిని చెబుతారు.