Pooja Hegde : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ముకుంద మూవీతో ఒక్కసారిగా యూత్ లో కూడా పూజ హెగ్డే కి మంచి క్రేజ్ వచ్చింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో పూజ జత కట్టింది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పూజ. అయితే గతేడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి.
ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సఫీస్ దగ్గర బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో రణవీర్ హీరోగా నటించిన సర్కస్ అనే సినిమా చేసింది. ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీ కి భాయ్.. కిసీ కి జాన్ అనే సినిమా లో నటించింది.
ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే వరుసగా 5 ఫ్లాప్ లు వచ్చినప్పటికీ పూజ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇదిలావుండగా ప్రస్తుతం పూజ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న SSMB28లో నటిస్తుంది. ప్రెస్రెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది పూజ హెగ్డే. గురూజీ అయినా పూజ ఫ్లాప్స్ కి చెక్ పెడతాడేమో చూడాలి.
Discussion about this post