రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేతల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది అక్రమం అని ఆక్రమణ దారులు మీడియాకు ఎక్కడం సహజంగా జరుగుతుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు, కాలువ గట్ల పై ఇళ్లు కూల్చినప్పుడు వారి తరపున పట్టించుకునే నాధుడు ఉండడు కానీ గీతమ్ లాంటి సంస్థల పై చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్న అందరూ అది అన్యాయం అని గగ్గోలు పెడతారు. అసలు ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చెయ్యడం తప్పని వారికి తెలిసి కూడా రాజకీయ కక్ష
సాధింపు చర్యలుగా పేర్కొంటూ మీడియా వేదికగా చెలరేగిపోతారు.
భూముల విలువ కోట్లలో పెరిగేకొద్దీ అధికారంలోకి రాగానే పాలక వర్గాలుకు చెందిన కులాల్లో పెద్ద మనుషులు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. రెగ్యులరైజ్ పేరుతో ప్రభుత్వ భూములు సొంతం చేసుకుంటున్నారు. భూమి వ్యవసాయేతర అవసరాలకు బహుళ జాతి కంపెనీల కు కేటాయించి భారీగా ముడుపులు తీసుకుంటున్నారు.సంస్థల పేరుతో పారిశ్రామిక అభివృద్ధి మండళ్ల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆ రెండు కులాల భూ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. తమకు తరగని సంపద మార్చుకునే క్రమంలో తమ భూమిని కోల్పోయేది ఎక్కువగా బీసీలు దళితులే కావడం గమనార్హం.
భూమి ఒక మానవ అనుబంధం ఉన్న అద్వితీయ రక్షణ నుంచి వ్యాపార వస్తువుగా మారిన తర్వాత దాన్ని పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారుతున్నారు. వ్యవసాయం తప్ప ఇంకో పని తెలీని వారు పట్నాలకు వలస పోతున్నారు. అగ్రకులాల చేతుల్లోకి భూములు వెళ్ళిపోయాక వారు అనాధలు గా మారుతున్నారు. తమకు తెలియకుండానే తాము ఆ రెండు కులాల చేతుల్లో బందీగా మారుతున్నారు.
ఇదొక చేదు సత్యం..!!