Rahul Gandhi :గతంలో రాహుల్ ని పప్పు అన్న బీజేపీ… నేడు అదే రాహుల్ ని చూసి గజ గజా వణుకుతుందా???
రాహుల్ గాంధీ జైలు శిక్ష, అనర్హత విషయంలో బీజేపీ దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది.జైలు శిక్ష అంశం పక్కనపెడితే కనుక, రాహుల్ విషయం లో బీజేపీ వైఖరి చూస్తుంటే,
ఇక రాహుల్ తో వారి పని అయిపోయినట్టే అని భయపడుతున్నట్టే అనిపిస్తుంది.
ఇటీవలే రాహుల్ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి రాహుల్ కి మంచి మద్దతు లభించింది.అదే సమయంలో రాహుల్ కూడా, ప్రజలకి అధికారం లోకి వస్తే ఏం చేస్తానో అని కూడా క్లియర్ గా ఒక భరోసా ఇచ్చారు. ఒక నమ్మకం కలిగించారు.
ఇక ఇక్కడినుండి బీజేపీ ఉలిక్కిపాటు మొదలయింది.రాహుల్ ని మొన్నటివరకు “పప్పు” అని హేళన చేసిన బీజేపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది.భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన రాహుల్ ఇమేజ్ ని పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నస్తున్న బీజేపీకి,2019 గుజరాత్ ఎన్నికల ప్రచారం లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయ్.. ఈ నెపం తో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే తో పరువు నష్టం దావా వేయించడం, జైలు శిక్ష వేయించడమే కాకుండా..ఆనక ఎంపీ పదవి విషయం లో కూడా అనర్హత వేటు వేయడం చక చకా జరిగిపోయాయి.
ఇవన్నీ గనుక నిశితంగా ఒకసారి గమనిస్తే.. మొన్నటివరకు రాహుల్ మా లెక్కలో లేరు, ఆయన పప్పు అని హేళన చేసిన బీజేపీ నేడు ఆయన విషయం గురించి మాత్రమే ఆలోచన చేస్తూ.. ఆయన జైలు శిక్ష నుండి ఎంపీ పదవికి అనర్హుడు అయ్యేలా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే … రాహుల్ విషయం లో బీజేపీ భయం స్పష్టంగా కనిపిస్తుంది.
కొసమెరుపు ఏంటంటే,మొన్నటివరకు కొన్ని కొన్ని విషయాల్లో ఒకే మాట మీద ఉండని ప్రతిపక్షాలు, నేడు రాహుల్ విషయం లో మూకుమ్మడిగా ఏకతాటి పైకి వచ్చి రాహుల్ కి తమ మద్దతు ప్రకటించడం కూడా, బీజేపీ భయానికి ఒక కారణం అయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు