Ram charan Birthday Special : ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ని మించి ఎదగాలి అనుకోవడం లేదు, వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఉంటే చాలని సభాముఖంగా మెగా ఫాన్స్ కి చెప్పాడు. కానీ మించి ఎదగడమే కాదు, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు ఈ చిరుత.
ఎంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినా, ఎంత సపోర్ట్ చేసిన పైకి ఎదగాలేని సందర్భాలు, జనానికి దగ్గర కాలేని సందర్భాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందిని చూసాము. పలనా వారి అబ్బాయి అంటే గుర్తు పెట్టుకుంటారేమో కానీ ఆదరించలేరు. పలనా వారిది సినిమా కుటుంబం అయినప్పటికీ ప్రేక్షకులకు దగ్గర చెయ్యడం ఎవరి తరం కాదు. నెపోటిజం అని బాలీవుడ్ లో వింటూనే ఉన్నాం,
ఈ మధ్య టాలీవుడ్ లో కూడా వింటున్నాం. అయితే ఎంత గొప్ప నటుడి కొడుకైనా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొడుకైనా జనానికి నచ్చితేనే మనోడే అంటారు లేదా పరాయివాడిగానే చూస్తారు. చిరుతలో కూడా రాంచరణ్ ని చిరంజీవి కొడుకుగా చూసినా తర్వాత వచ్చిన మగధీర, రచ్చ, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం వంటి మూవీస్ తో టాలీవుడ్ టాప్ హీరో కాగా RRR తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గా కాకుండా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు తండ్రి బాటలోని నడిచి వినమ్రంగా ఉంటూ తన తోటివారికి గౌరవ, మర్యాదలు ఇస్తూ, ఇతరులకు చేతనైనా సాయం చెయ్యడం, అభిమానులు అంటే ప్రేమ, ఆపేక్షతో ఉంటూ అందరికీ మరింత చేరువగా ఉంటాడు రామ్ చరణ్, అభిమానులకు శ్రీ రాముడు అయ్యాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్,
అన్న సంతార్పణ ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. భారీ డిజాస్టర్ ఆరెంజ్ మూవీని రీ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ చేశారు. ఆ డబ్బులను జనసేన పార్టీ ఫండ్ కి ఇచ్చి.. రామ్ చరణ్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్ బర్త్ డే అంటే కుటుంబ సభ్యులకు లేదా అభిమానులకి పండగల కాకుండా యావత్ దేశం పండగల చేసుకునేలా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. Happy Birthday GLOBAL STAR RAM CHARAN