Razia Sultan Movie : ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టరీలను సినిమాలుగా తీస్తుంటారు. అవి చాలావరకు సక్సెస్ అవుతుంటాయి. నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో, ఈ నేపథ్యంలోనే మొఘల్ సామ్రాజ్యాన్ని తెరపై ఆవిష్కరణ నుండి మొదలు పెడితే బాహుబలి వరకు ఇలా పిరియాడికల్ మూవీస్ లో చాలావరకు వందలో 80% విజయాన్ని అందుకున్నవే.
కానీ ఒకే ఒక్క సినిమా మాత్రం బిగ్గెస్ట్ ప్లాప్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం. ఏకంగా బాలీవుడ్ నే అప్పుల్లో కూరుకు పోయేలా చేసిన ఆ అద్భుతమైన చిత్రమేంటో ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం. ఆ సినిమాలో హేమామాలిని, ధర్మేంద్ర ముఖ్య తారాగణంగా నటించారు. ఢిల్లీ సుల్తాన్ వన్ అండ్ ఓన్లీ ఫిమేల్ రూలర్ “రజియా సుల్తాన్” బయోపిక్ మూవీ అది.
ఈ సినిమా కోసం అప్పట్లోనే పదికోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తుంది. అప్పుడు 10 కోట్లు అంటే ఇప్పుడు కచ్చితంగా 200 కోట్లతో సమానం అన్నమాట. 1975లో ఈ సినిమాను ప్రారంభించారు. కాస్టింగ్ చేంజెస్ కారణంగా చివరిగా 1983లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే అప్పటికే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లు మాత్రమే రాబట్టగలగడం గమనార్హం. ఉర్దూ భాషను వినియోగించుకోవడం కాంట్రవర్సీ కాగా, స్లో న్యారేషన్ చిత్రానికి మైనస్ పాయింట్ గా మారిందని సినీ విశ్లేషకులు వెల్లడించారు.
ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలవడం, ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇన్వెస్టర్స్ కు భారీ నష్టాలను మిగిల్చిన ఏకైక సినిమాగా రికార్డు కూడా పొందింది. నిర్మాత కమల్ అమ్రోహి మాత్రం ఈ సినిమాను క్లాసిక్ ఫిల్మ్ గా అభివర్ణించడం విశేషం. ఈ చిత్రం ప్రేక్షకులకు సరిగా అర్థం కాలేదని, సాధారణంగా సినిమాల్లో ఉండే మసాలా ఇందులో లేకపోవడం కారణంగానే
పాకిజా, షోలే మాదిరి హిట్ అందుకోలేకపోయిందని ఆయన తెలిపారు. మొత్తానికి కమల్ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పినప్పటికీ, చాలా నష్టాన్ని మాత్రం చవి చూశాడు. అతనికి చివరి చిత్రం కూడా ఇదే అవడం గమనార్హం. లాంగ్ బ్రేక్ తర్వాత 1993లో “ఆఖరి మొగల్” మూవీ ప్రకటించిన, ఆయన ఆ చిత్రాన్ని తెరకెక్కించకుండానే మధ్యలోనే చనిపోయారు.