Richest Woman : గెలుపు ఒక్కరి సొత్తు ఏమీ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు,ఓటములు ఉంటూనే ఉంటాయి. విజయానికి ఆడ,మగ తేడా లేదు. కష్టపడి పని చేస్తే విజయం ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ 45 సంవత్సరాల వయసులోనే ఏకంగా 8700 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించారు.
ఆమె ఈ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సంపన్నురాలైన మహిళ కావడం ఇక్కడ గమనార్హం. ఆమె పేరు “మహిమా దాట్ల” యంగ్ బిజినెస్ ఉమెన్. మహిమా దాట్ల సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమే కాకా మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని సమాజానికి చాటి చెప్పింది.
మహిమా దాట్ల లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమె హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ అనే ఫార్మా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే హెపారిన్ మెడిసిన్ ద్వారా ఈ సంస్థ ప్రస్థానం కొనసాగింది.
అయితే మహిమ దాట్ల తండ్రి ఆకస్మికంగా మరణించడం వల్ల తండ్రి తదనానంతరం ఆమె బయోలాజికల్ ఇ బాధ్యతలను స్వీకరించారు. ఈ బయోలాజికల్ సంస్థ నుండి..మీజిల్స్, టెటానస్, రుబెల్లా లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సరఫరా చేస్తారు. ఈ సంస్థ వ్యాక్సిన్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా ఉంది.
మహిమ దాట్ల తన తెలివితేటలతో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది కాలంలోనే ఆస్తుల విలువ 1000 కోట్ల నుండి 8000 కోట్ల రూపాయలకు చేరుకునేలా కృషి చేశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే..? టెటానస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో బయోలాజికల్ సంస్థ కూడా ఒకటి కావడం గమనార్హం.
గత పది సంవత్సరాల్లో ఈ సంస్థ ద్వారా 200 కోట్లకు పైగా డోసులతో వ్యాక్సిన్లను సరఫరా చేయడమే కాకా.. కరోనా వ్యాక్సిన్ సైతం ఈ సంస్థ తయారు చేసింది. నిజానికి ఈ వ్యాక్సిన్ వల్లే మహిమ ఆస్తులు అంచనాలకు మించి రెట్టింపు అయ్యాయి. సంపన్నురాలైనా మహిళగా ఆమెను నిలబెట్టాయి. తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు గాను అత్యంత సంపన్నురాలైన మహిళల్లో మహిమా దాట్ల పదో స్థానంలో ఉన్నారు.