Robot : “రోబో” లు మనకందరికీ తెలుసినవే కదా..మానవుని కృత్రిమ సృష్టి రోబోలు.రోబోలకు ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఎంతటి పనిని అయినా సునాయాసంగా చేసేస్తాయి.టెక్నాలజీ దినదినాభివృద్ది చెందుతుంది.దానిలో భాగంగానే రోబో లు అవిర్భవించాయి.
మనుషులు చేయాల్సిన పనులను వాళ్ళ స్థానం లో రోబోలు చేసేస్తున్నాయి. చాలా పరిశ్రమలు తమ అవసరాల్లో, తమ పనులల్లో మనుషుల స్థానంలో ఎక్కువ శాతం రోబోలనే ఉపయోగించి పనులు చేపించుకుంటున్నారు. రోబోలకు వర్క్ కు సంబంధించిన ప్రోగ్రామ్‌ను ఫిక్స్ చేస్తే…చక్కగా తన పని అది చేస్తూ పోతుంది..

రోబోలతో పోలిస్తే మనుషులు కొన్ని గంటలు పని చేస్తే అలసి పోతారు. కానీ రోబోలకు అలసట ఉండదు.ఎన్ని గంటలు అయిన పని చేయగలవు. అని అనుకుంటే పప్పులో కాలు ఏసినట్టే..రోబోలు కూడా కంటిన్యూగా వర్క్ చేస్తే అలసిపోతాయని తెలిసింది. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతుంది.
ఒక కన్వేయర్ బెల్ట్‌పై రోబోట్ ప్లాస్టిక్ కంటైనర్‌లను పెడుతూ ,గంటల తరబడి ఆపకుండా పనిచేస్తునే ఉంది. అలా చేస్తూ చివరికి ఒక కంటైనర్‌ను ఎత్తుతుండగా సడన్ గా కుప్పకూలి కింద పడిపోయింది. రోబోలు కూడా అలా గంటల తరబడి ఆపకుండా పనిచేస్తే మనుషుల లాగానే అలిసిపోతాయి అని తేలిపోయింది. దీన్ని చూసిన నెటీజన్స్ చాలా ఆశ్చర్యపోయారు.
