Role of BRS in national politics : టిఆర్ఎస్ పార్టీ సేవలు దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందాలని సీఎం కెసిఆర్.. పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించి, మార్పులు తీసుకొస్తుంది అని అందరు అభిప్రాయ పడుతున్నారు. బిజెపి లాంటి అసమర్థ ప్రభుత్వ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని జాతీయం చేసామని, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు అయిన వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యం అని సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వందే గెలుపు అని ముందే ధీమాతో ఉంది ఆ పార్టీ.
ఎందుకంటే రాష్టంలో ఎలాగైతే ప్రతిపక్షం లేదో, అదేవిదంగా కేంద్రంలో సరైన ప్రతిపక్షం లేదు. ఒకవిధంగా కేసీఆర్ కి ఇది రాజకీయంగా కలిసొచ్చే విషయమే.. ఒక్క బిజెపి ని ఎదుర్కొంటే తను గెలవొచ్చు అని కేసీఆర్ అభిప్రాయం. ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన బిజెపి ప్రభుత్వాన్ని అంత ఈజీగా ఎదుర్కోవడం సులువు ఏమి కాదు. పొత్తులతో దాన్ని సాధించాలి అని చూస్తున్నారు కెసిఆర్ అది ఎంత వరకు సాధ్యమో వేచి చూడాలి.