Sai Pallavi : సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు.
అయితే సాయి పల్లవి తాజాగా తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఒక హీరో ఓ సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటే ఓకే అనుకోవచ్చు కానీ ఓ హీరోయిన్ తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రిస్కె అవుతుంది. అసలే హీరోయిన్ కెరీర్ స్పాన్ తక్కువ. అలాంటిది ఒక సినిమా కోసం రెండేళ్లు అంటే కెరీర్ నే రిస్క్ లో పెట్టినట్టవుతుంది.
ఇప్పుడు లేడీ పవర్ స్టార్ అలాంటి రిస్క్ కే సిద్ధమవుతోంది. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఇందులో భాగంగా సీత పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారు.
ఈ పాత్ర కోసం ఏకంగా రెండేళ్ల పాటు ఇతర సినిమాలకు దూరంగా ఉండబోతోంది సాయిపల్లవి. కేవలం రామాయణం ప్రాజెక్టు కోసమే ఆమె రెండేళ్ల పాటు వర్క్ చేయాలని నిర్ణయించుకుందట. ఈ రెండేళ్లల్లో యంగ్ హీరోయిన్లు శ్రీలీల, కృతిశెట్టి లాంటి వాళ్ళు అరడజను సినిమాలు ఈజీగా చేస్తారు.
కానీ సాయిపల్లవి మాత్రం సీత పాత్ర కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకుందట. శర్వానంద్ 35 మూవీలో సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ సాయిపల్లవి మాత్రం తన దృష్టి మొత్తం రామాయణం ప్రాజెక్టుపైనే పెట్టిందంటున్నారు. ఏదేమైనా ఒక హీరోయిన్ ఒక సినిమా కోసం సాహసం అనే చెప్పాలి.