Samyuktha Menon : మలయాళం పాప్ కార్న్ చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లానాయక్ లో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకుంది సంయుక్త. అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారలో చేసింది చిన్న పాత్రే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది.
దాని తర్వాత ధనుష్ “సార్” మూవీలో మీనాక్షి మేడమ్ గా ప్రేక్షకుల మనసు దోచింది సంయుక్త మీనన్. ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోయిన్స్ లేరు. తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో తళుక్కుమంది. ఇంతకు ముందు మూవీస్ తో పోలిస్తే విరూపక్షలో సంయుక్త పెర్ఫార్మన్స్ కి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. గ్లామర్ టచ్ ఉన్నట్టుగా ప్రమోషన్లలో చూపించినా అసలు సినిమా చూశాక ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
దీంతో ఇప్పుడు టాలీవుడ్ దర్శక-నిర్మాత దృష్టి ఈ అమ్మడుపై పడింది. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలకు ఆమె పేరునే సిఫారసు చేస్తున్నారని టాక్. సంయుక్త మాతృబాష మలయాళం కన్నా ఇక్కడే డిమాండ్ పెరుగుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. సంయుక్త త్వరలో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతోందో..
Discussion about this post