significance of women’s day : ఈ సృష్టికి మూలం ఒక మహిళ. ఈ సృష్టి మొత్తం ఒక మహిళ చేతిలోనే ఉంది. ఆమె లేకపోతే అసలు మనిషి మనుగడనే లేదు. సృష్టిని పెంచి పోషించాలి అంటే అది ప్రకృతి పరంగా మహిళకే సాధ్యం. మహిళలేని సమాజాన్ని కానీ కుటుంబాన్ని కానీ మనం ఊహించుకోలేం. రోజు రోజుకి మహిళా సాధికారత మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు.
మహిళా దినోత్సవం అనేది.. మహిళా హక్కుల కోసం, లింగ సమానత్వం కోసం, ఓటు హక్కు కోసం ఏర్పడింది.1909 న్యూయార్క్ నగరంలో ఈ మహిళ దినోత్సవం మొదటగా జరిపారు. తర్వాత తర్వాత ఇది ప్రపంచ దేశాలు దాటుతూ ఇండియాకు చేరుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇండియాలో కూడా మహిళా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.
రాజకీయ పార్టీలు ఈ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక వేడుక లాగా జరుపుతున్నారు. ఆరోజు మహిళా ఉద్యోగులందరికీ సెలవుదినంగా ప్రకటించాయి భారతదేశ ప్రభుత్వాలు. అందరు మహిళలు వీలైనంత వరకు ఈరోజును ఒక పండుగలాగా జరుపుకుంటూ, తమకంటూ ఒక ప్రత్యేకమైన రోజును సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
మహిళలు రాణించలేని రంగం లేదు. అన్నింట్లో వాళ్లు ముందడుగు వేస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కాకుండా విమానాలు నడిపే స్థాయి నుండి అంతరిక్షంలోకి వెళ్లే స్థాయిలోకి ఎదిగారు. జీవన మనుగడకు వెన్నెముక లాగా ఉన్న మహిళలు ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆశిద్దాం.. మరొక్కసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..