Sorvagsvatn lake : మనకు తెలిసినంతవరకు నదులు ,సముద్రంలో కలుస్తూ ఉంటాయి కదా.. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సముద్రంకి ఎత్తులో ఒక సరస్సు ఉంది. మీరు వింటున్నది నిజమే సముద్రం పైన ఒక సరస్సు ఉంది. అది ఎక్కడో.. ఆ వింత దృశ్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. డైన్మార్క్ సమీపంలోని ఫోరే దీవులు వద్ద వాగర్ ద్వీపం వద్ద సర్వాగ్‌స్వాటన్ సరస్సు ఉంది. ఈ సరస్సు 3.4 చదరపు కి.మీ విస్తీర్ణం కలిగి, ఈ సరస్సు చివరికి సముద్రంలో కలుస్తుంది.
అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ దాగి ఉంది. ఈ సరస్సును మనం గమనించినట్లయితే ఇది సముద్రం పైనుంచి వేరే చోటికి వెళ్తుందా అన్నట్టుగా మనకు అనుమానం వస్తుంది. ఈ సరస్సు ఒక ప్రదేశానికి రాగానే ఒక చిన్న జలపాతంలా మారి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఈ అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.
ఈ సరస్సును సర్వాగ్‌స్వాటన్ అని లైటిస్వాటన్ అని పిలుస్తుంటారు. సరస్సుకు పశ్చిమాన ఉన్న సర్వాగుర్ ప్రజలు సర్వాగ్‌స్వాటన్ అని, అలాగే తూర్పున ఉన్న శాండ్‌వాగర్ ప్రాంతంలో నివసించే ప్రజలు లైటిస్వాటన్ అని పిలుస్తారు. ఈ సరస్సు సముద్రమట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ సరస్సు సముద్రానికి దగ్గర్లో ఉంటుంది. కానీ అలా కనిపించి అందర్నీ భ్రమలోకి నెట్టేస్తుంది.
అలాగే ఈ సరస్సు చుట్టూ కొండ శిఖరాలు నీటిని సముద్రంలోకి వెళ్లకుండా అడ్డంగా ఉంటాయి. ఈ సరస్సు నుంచి సముద్రంలోకి దూకే జలపాతం ఒకటుంది. దాని పేరు బోస్‌దలాఫోజర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ఫోరే దీవుల్ని బ్రిటిష్ వారు ఆక్రమించేశారు. అప్పటినుంచి జర్మనీకి చెందిన యుద్ధనౌకలను ఆపేందుకు ఇక్కడ వైమానిక కేంద్రాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు. శత్రువుల బారిన పడకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని వారు ఎంచుకున్నారు. ఆ క్రమంలోనే 1941 లో ఒక యుద్ధ విమానం ఇక్కడ ఆగడం విశేషం.