Sreeleela Birthday Special : యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకెట్ లా దూసుకొచ్చి టాలీవుడ్ నా అడ్డా అంటుందీ బ్యూటీ.. పెళ్లి సందD మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించిందీ యంగ్ బ్యూటీ. శ్రీలీల కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ మూవీ రిజల్ట్ నిరాశపరచడంతో నెక్స్ట్ మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరించింది శ్రీలీల. దీంతో సెకండ్ మూవీ రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ధమాకాతో ఈ ముద్దుగుమ్మ జోరు పదిరెట్లు పెరిగింది. కేవలం శ్రీలీల కోసమే థియేటర్ కు వెళ్లే అభిమానులు శ్రీలీల సొంతం. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. బాలకృష్ణ కూతురి పాత్రలో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరిలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీలనే ఎంపిక చేసారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నితిన్ 32 లో కూడాశ్రీలీలనే ఫైనల్ చేశారు మేకర్స్. ఇవేకాక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో, నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్.
రామ్ పోతినేనికి జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO మూవీ చేస్తోంది శ్రీలీల. ఇవికాకుండా మరికొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పిందీ అమ్మడు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. ఒకేసారి పది సినిమాలు చేస్తున్న ఘనత ఈ బ్యూటీకే దక్కుతుంది. అందరు హీరోయిన్లు రోజల్లో కాల్‌షీట్లు ఇస్తుంటే.. శ్రీలీల మాత్రం గంటల్లో ఇస్తుండటం విశేషం.
రోజూ గంటల తరబడి షూటింగ్ లు చేస్తూనే ఉన్నా.. టైమ్ సరిపోవడం లేదు. ఒక పూట ఒక మూవీ సెట్ లో ఉంటే.. ఇంకో పూట మరో సెట్లో దర్శనమిస్తుంది శ్రీలీల. ఇప్పుడీ అమ్మడి కాల్షీట్స్ కోసం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి పెద్దదైన ఈ కన్నడ బ్యూటీ.. 21 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ ను ఏలేస్తుండటం విశేషం.