పుట్టిన ప్రతోడు చావక తప్పదు, కానీ ఆ చావు బలవన్మరణం ద్వారా కాకూడదు, అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళను ఈ సమాజం పిరికివాళ్ళంటుంది, కానీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వాళ్లే నా హీరోలు అంటున్నాడు. అదేంటి అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే పూరీ మ్యూజింగ్స్ లో “సూసైడ్” అంటూ చెప్పిన మాటలు యధాతథంగా…
లైఫ్ లో ఎన్నో సార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుద్ది, ఛీ ఎదవ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. మనలో చాలా మందికి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. ఇలా సూసైడ్ ఆలోచన ఉన్న వాళ్లంటే నాకు చాలా గౌరవం.
ఎందుకంటే ఈ ఆలోచన ప్రత్యేకంగా తెలివైన వాళ్లకు మాత్రమే వస్తుంది, సన్నాసులు ఎప్పుడూ అలా ఫీల్ అవరు. అందరూ అంటారు పిరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారని, కానీ అది చాలా తప్పు చనిపోవాలి అంటే చాలా ధైర్యం కావాలి. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది.
అయినా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావ్, జీవితంలో ఎదురవుతున్న సమస్యల వలనా? ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు. కుటుంబ పరమైన సమస్యలు కావచ్చు. ప్రేమ కావచ్చు.
సమస్యను బాధ్యతగా తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. బాధ్యత లేని వెధవలకు ఇలాంటి ఆలోచనలు రావు. వాళ్లు హాయిగా ఉంటారు. చావాల్సింది వాళ్ళు.. నువ్వు కాదు.. నీకు ప్రేమించే గుణం ఉంది, తప్పు చేయవు, ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు, ఆత్మాభిమానం ఎక్కువ, పైగా నువ్వు తెలివైన వాడివి, బాధ్యత ఫీల్ అవుతావ్. దానికి తోడు దమ్ము ఉంది. నీకు తెలుసా? ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి. నువ్వు చావడం ఏంటి? We need you, we need like a hero like u..
సినిమాల్లో ఇలాంటి హీరోలను చూసే మేం విజిల్స్ వేస్తాం. అలాంటి వాడివి నువ్వు మా మధ్యలో ఉన్నావు అంతకంటే ఏం కావాలి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. జీవితం అంటే అర్థం లేనిదని నీకు అనిపించవచ్చు. ఈ మనుషులు వాళ్లు వేసే డ్రామాలు నీకు చిరాకు అనిపించవచ్చు.. నీకు అనిపించింది నిజమే ఇదంతా పనికిమాలినది.. కానీ, ఒకటి ఏ సమస్య గురించి నువ్వు చావాలి అనుకుంటున్నావో ఆ సమస్యను పరిష్కరించు.. నిన్ను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చెయ్.. ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత కూడా కావాలనుకుంటే చావు.. కానీ ఒక చిన్న ప్రాబ్లం కోసం నా హీరో చచ్చిపోవడం నేను తట్టుకోలేను..సినిమా ఫ్లాప్ అయిపోద్ది. నేను నీ థియేటర్ లో ఉన్న..నన్ను డిసప్పాయింట్ చేయొద్దు..నిన్ను ఇబ్బంది పేడుతుంది ఎవరు? ఆ నా కొడుకులను చావగొట్టు.. నీకే కాదు మాకు కూడా వాళ్ళు వేస్ట్ నా కొడుకులే.. కానీ ప్రాబ్లం కోసం చావద్దు..
అప్పులు చేశావా? .. డబ్బు కోసం పీక్కు తింటున్నారా? వాళ్లు వస్తే జిప్ విప్పి చూపించు.. ప్రేమించి మోసం చేశారా చేస్తే చెయ్యని వాళ్ళు నీ ప్రేమకు అర్హులు కాదు.. నువ్వు ఉండు ఇక్కడ..నాకు నువ్వు కావాలి.. నా కంటే ముందు నువ్వు పోనవసరం లేదు.. నీకు నాకు పెద్ద గ్యాప్ కూడా లేదు కేవలం రెండు రోజులే… నువ్వు ఉండు అందరం కలిసే పోదాం… చుట్టూ చెత్త నా కొడుకులు ఎందుకు నాకు నువ్వు కావాలి.. గుర్తుపెట్టుకో చావడానికి సిద్ధంగా ఉన్న వాడిని ఎవ్వడు చంప లేడు.. మనందరం జీవితంలో చావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చావద్దు..
అంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్లను గౌరవిస్తూనే వారిలో ఆ భావనను తొలగించే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా ఆత్మహత్యలపై “నేను నా రాక్షసి” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు పూరీ..మరి తను చెప్పిన మాటవలన ఒక్కరైనా అలాంటి ఆలోచన నుండి దూరం అయితే అంతకంటే కావలసింది ఏముంది ?