Telangana Politics : తెలంగాణా లో హంగ్ వస్తుందా..?
హంగ్ ఆసెంబ్లీ పై రాజకీయ పార్టీల ‘ఊ’హాకారాలు..!!
రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ తప్పదా..? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు ప్రధానపార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దేనికదే అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరింపజేస్తున్నాయి. 119 నియోజకవర్గాల అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్ మార్కు దాటాల్సిందే.. అధికారంలోకి రావటానికి బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటి రావటం కష్టమనే వ్యాఖ్యలు వింటున్నాం.
కాంగ్రెస్ పరిస్దితి : సర్దుకోరు. సరిదిద్దుకోరు. అసంతృప్తి జ్వాలలు ఆరనివ్వరు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం.. నేతలకు స్వేచ్ఛ ఎక్కువ అని కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకుంటారు. మిగతా పార్టీలో అది లేదని విమర్శిస్తుంటారు. కానీ… పరిమితికి మించిన ఆ స్వేచ్ఛే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలిట శాపంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.. మూడు అడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల మనసుల్లో స్థానం ఉన్నా, ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో.. హస్తం పార్టీ వరుసగా వైఫల్యం చెందుతూ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ టీఆర్ఎస్, బీజేపీలను కార్నర్ చేస్తూనే సొంత పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ఇచ్చారు. ఆటలు కుదరవని తేల్చి చెప్పేశారు. పొత్తులు, పార్టీపై విమర్శలు చేసే వాళ్లు తమకు అవసరం లేదని విబేధాలను పక్కనపెట్టి పని చేయాలని సూచించినా ఆమలు శూన్యం . రాహుల్ ఏకతా యాత్రలో నాయకుల వైఖరి మనం చూశాం . ఎవరికి వారే అన్న రీతిలో సాగుతున్న పాదయాత్రలు నాయకత్వ లేమి సమిష్టి కృషీ వంటీవి లోపించిన పార్టీ సీట్లూ గెలిచి క్రీయాశీలక పాత్ర పోషిస్తూందన్నది వాస్తవిక దూరం.
తెలంగాణ బీజేపీ : వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మిషన్ 90 ప్రణాళిక సిద్ధం తెలంగాణ బీజేపీ మిషన్ 90 టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో గెలుపును లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ ప్రారంభించింది. 2023 తెలంగాణలో కాషాయజెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. పార్టీ బలహీనంగా ఉండి బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వివరా లపై కసరత్తు ప్రారంభించింది బి.జె.పి ఆధిష్టాన వర్గం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, విధాన పరమైన హామీల్లాంటి అంశాలతో విశ్లేషించి వివరణాత్మక నివేదికను రూపోందించడాన్ని బట్టి చూస్తే బలమైన లీడర్స్ కోసం వేట మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఇప్పటికే లిస్ట్ ఔట్ చేసినట్లు తెలుస్తోంది.
బలమైన నేతలు వస్తామంటే పార్టీ తలపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలో నియోజకవర్గాల్లో నాయకత్వ కొరత ఉన్నట్లుగా కేంద్ర బీజేపీకి స్పష్టమైన రిపోర్టు అందింది. దీంతో ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికి బీజేపీలో చేరేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో.. సీనియర్ నేతలకు టిక్కెట్లపై భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు చేరికల కమిటీ వివిధ పార్టీల లోని నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ అసంతృప్తి నేతలపై గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉంది.
సీనియర్లు నేతలు పార్టీని ధిక్కరిస్తున్నారు. ఈ కారణంగా అలాంటి నేతల్లో నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేతలను ఆకర్షించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మిషన్ 90లో సక్సెస్ సాధించాలంటే.. ఖచ్చితంగా వలసలు అవసరం అని బీజేపీ ఆధిష్టాన వర్గం భావిస్తోంది. అధికారం చేజిక్కించుకోవడం పై దృష్టి సారించడం అప్రయత్నంలో విఫలమైతే ప్రధాన పత్రిపక్షంగా ఎదగటం. గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధించడం. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కృషి చేస్తుంది అన్న భరోసాను ప్రజలలో కల్పించాలని అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తుంది. మిషన్ 90 కార్యాచరణ రాష్ట్రంలోని వివిధ పార్టీల ఆశావహ అభ్యర్దులను అకర్షింస్తుందని విశ్లేషకుల భావన.
క్షేత్రస్దాయి పరిస్దితులను కార్యకర్తల సూచనలను పరిగణంలోనికి తీసుకోకుండా సర్వేలు, వ్యూహకర్తపై ఆధారపడి. ఒంటెత్తు పోకడలను ఒంట పట్టించుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఈ చర్య ఒక్కింత హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాలు అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, జవహర్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. అవిశ్వాసం బాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తిమీద సాముగా మారింది.
ఖమ్మం గుమ్మంలో అసమ్మతి, కొన్ని నియోజక వర్గాల శాసన సభ సభ్యుల పనితీరు , ఇటీవల జరిగిన ఫాం హౌజ్ పరిణామాలు, ముఖ్యమంత్రి తీరుపై న్యాయస్దానం చేసిన వాఖ్యలు ఢిల్లీ లిక్కర్ భారత్ రాష్ట్ర సమితి (భారాస) ఇబ్బంది పెట్టె పరిణామాలు. దీనికి తోడు సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వెనుక ఇతర కారణాలేవో ఉన్నాయని అధికార పార్టీ వాళ్లే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి రావడానికి వారు ఒప్పుకోలేదట.. ఫ్యూచర్లో తమకు ఇబ్బందులు ఏర్పడుతాయనే ఉద్దేశంతో స్టాలిన్, తేజస్వి అనుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వారు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సభలో పాల్గొంటే వేరే ఇష్యూస్ వస్తాయని వారు భావించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ సైతం ఈ కార్యక్రమానికి రావడానిక సుముఖత చూపలేదు. రాజకీయంగా కొన్ని ఎదురుదెబ్బలు తగలడం.. ఇటీవల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం లాంటి సమస్యల మధ్య సచివాలయం ప్రారంభించడం అంతమంచిది కాదని కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం వెనుక రాజకీయ కోణం దాగువున్నదనేది యదార్దం. భారత్ రాష్ట్ర సమితి పైకి గంభీరంగా 100 పైగా సీట్లు వస్తాయని ప్రకటిస్తునా అనుకున్న ఫలితాలు రావు గాని అధికారం చేజిక్కించుకోగలదు.
ప్రభుత్వ వ్యతిరేకత అసమ్మతి, వలసలు వర్గపోరు ఫలితాలని ప్రభావితం చేస్తాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత రెండు సార్లు కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఎన్నికలను ఎదుర్కోంది భారత్ రాష్ట్ర సమితి. మరి ఈ సారి పరిస్దితులు అందుకు భిన్నం. భారత్ రాష్ట్ర సమితి ఆధికారంలోకి వచ్చినా పార్టీ లో వర్గ పోరు తప్పదు. ఏది ఎమైనా ముందస్తు వైపు మెగ్గు చూపకుండా పరిస్దితులను చక్కదిద్దుకొని వాస్తవికతను గ్రహించి భారత్ రాష్ట్ర సమితి ముందుకు సాగాలి.
సమిష్టి కృషితో కాంగ్రెస్ పనిచేయ్యాలి. గెలిచిన అభ్యర్దులు పార్టీవీడరని నమ్మకంకలిగించాలి. కేడర్ ని అయోమయ పరిస్దితులలోకి నెట్టకుండా చూడాలి. బి.జే.పి గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుపుపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. పట్టణ ప్రాంతాలలో పట్టు సడలనీయరాదు. వివాదాస్పద వ్యాఖ్యలకంటే విధాన పరమైన వ్యాఖ్యలు మేలు చేస్తాయి. భావవ్యక్తీకరణ, వ్యక్తిగత విమర్శలు మాని సకారాత్మక రీతిలో వ్యవహరిస్తే మేలు. ఏది ఎమైనా ముందస్తు వైపు మెగ్గు చూపకుండా పరిస్దితులను చక్కదిద్దుకొని వాస్తవికతను గ్రహించి భారత్ రాష్ట్ర సమితి ముందుకు సాగాలి. సమిష్టి కృషితో కాంగ్రెస్ పనిచేయ్యాలి గెలిచిన అభ్యర్దులు పార్టీవీడరని నమ్మకంకలిగించాలి. కేడర్ ని అయోమయ పరిస్దితులలోకి నెట్టకుండా చూడాలి. బి.జే.పి గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుపుపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి పట్టణప్రాంతాలలో పట్టు సడలనీయరాదు. భావవ్యక్తీకరణ, వ్యక్తిగత విమర్శలు మాని సకారాత్మక రీతిలో వ్యవహరిస్తే మేలు.. రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నట్లు ఈ సారి హంగ్ అసెంబ్లీ రాదు . ఓటరు తీర్పు అంతిమం.. శిరోధార్యం..
–శ్రీధర్ వాడవల్లి, హైదరాబాద్