The Maasai Tribe of Kenya : మానవ జీవితంలో కొన్ని ఆచార సాంప్రదాయాలు బాగుంటాయి. కానీ కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించిన ఆచారాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా, మనుషులకు ఇబ్బందులను గురిచేస్తాయి. దీంట్లో చాలా ఆచారాలు ఒక భారత దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా ఇప్పటికీ పాటిస్తున్నారు. కొన్నిచోట్ల మనిషికి చెట్టుకి పెళ్లి చేయడం.
ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుందని మూఢనమ్మకంతో ఇలా చేస్తుంటారు. లేకపోతే శవాలతో పెళ్లి చేయడం, వధూవరులను చీపురులతో కొట్టడం ,ఏదో ఒక వింత ఆచారం మనకు కనిపిస్తూనే ఉంటుంది. పెద్దలు కొన్ని ఆచారాలను పాటించి వంశపారంపర్యంగా వాటిని అలవాటు చేస్తారు. కానీ ఇప్పటి తరం వాటి వల్ల ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇలాంటి వింత ఆచారమే ఇప్పటికీ కెన్యాలో కొనసాగుతుంది. కెన్యా చాలా వెనుకబడిన దేశం. ఇక్కడ మస్సాయి అని తేగా ప్రత్యేకంగా ఉంటుంది.
ఆ తెగ వాళ్ళు ఆచారాలు పక్కాగా పాటిస్తారు. అయితే పెళ్లి సమయంలో వధువుపై ఉమ్మి వేయడం లాంటి ఒక మూర్ఖపు ఆచారాన్ని వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు వారు దాని గురించి ఇది మా ప్రత్యేక సంప్రదాయమని చెప్పడం గమనార్హం. ఇక్కడ వింత ఏమిటంటే పెళ్లికూతురు తండ్రి తన కూతురు తల పైన, ఎదపైన ఉమ్మి వేస్తాడు.
ఇది మాకు అనాదిగా వస్తున్నది మా కుటుంబ పెద్దలు పాటిస్తున్నారు. మేము కూడా పాటించాలి. లేకపోతే మాకు అరిష్టం జరుగుతుందని వారు చెబుతారు. ఈ ఆచారాన్ని పాటిస్తేనే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని లేకపోతే వారి జీవితం కష్టాల పాలవుతుందని వారి నమ్మకం. ఇలాంటి కట్టుబాట్ల కోసం ఆ తెగవారు ప్రాణాలను సైతం లెక్కచేయరు.