The People of that Village Live for 100 Years : ఒక మనిషి సగటు జీవితకాలం 60 నుండి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కానీ ఒక గ్రామంలో మాత్రం మనుషులు 100 ఏళ్ల వరకు బతుకుతున్నారు. అవును మీరు వినేది నిజమే. ఆ గ్రామంలోని మనుషులు దాదాపు 97 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు. మరి ఆ వింతైన గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామంలో మనుషులు అలా జీవించడానికి కారణాలేంటో తెలుసుకుందాం.
ఆ విచిత్రమైన గ్రామం జపాన్ లో ఉంది. దాని పేరు ఒకినావా ప్రిఫెక్చర్. ఈ గ్రామంలోని ప్రజలు భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికే వాళ్ళుగా ప్రత్యేక గుర్తింపును పొందారు. వీరు నివసించే ప్రాంతాన్ని ‘దీర్ఘాయువు ద్వీపం’ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వీరి జీవితకాల వెనుక ఉన్న రహస్యాన్ని వారు బహిర్గతం చేశారు. ముఖ్యంగా వీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్లనే వారు దీర్ఘాయుని పొందుతున్నారని వెల్లడించారు.
ఈ గ్రామంలో కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆహారాలు అధికంగా తింటారు. చక్కెరను చాలా తక్కువగా వాడుతారు. భోజనాన్ని నెమ్మదిగా తినడమే కాకుండా కడుపునిండా తినరు. అందుకే వీరు 97 సంవత్సరాల వరకు జీవించి ఉంటున్నారు. అలాగే వృద్ధాప్యంలో కూడా చాలా చురుగ్గా తమ పనులు తాము చేసుకుంటూ ఆనందంగా బ్రతికేస్తున్నారు.