Thor is the Conqueror of the World : ప్రపంచాన్ని చుట్టుముట్టి రావాలంటే ఖచ్చితంగా విమానాన్ని ఎక్కవలసిందే లేకుంటే అది సాధ్యం కానీ పని. కానీ అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేసి చూపించాడో వ్యక్తి. అతని యాత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అతని పేరు థోర్. అతను 2013లో అక్టోబర్ 10న డెన్మార్క్ లోని తన ఇంటి నుంచి యాత్రను ప్రారంభించాడు. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో అతని యాత్రను విజయవంతంగా ముగించాడు.
అయితే థోర్ ఈ యాత్ర మొత్తంలో ఒకసారి కూడా విమానాన్ని ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టుముట్టి రావడం ఒక అద్భుతం. విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టిన మొదటి వ్యక్తి ఇతడే. మరి ఇన్ని దేశాలు తిరగడం వెనక అసలు కారణమేమిటి అని థోర్ ని ప్రశ్నిస్తే.. అన్ని దేశాలు ఉన్నాయి కనుక అని చిరునవ్వుతో సమాధానం చెప్తాడు. జూన్ 13న మాల్దీవులోనీ తన ఇంటి నుండి బయలుదేరి తువాలు, సమోవా, టోంగా,పలావు,నౌరు, కిరిబటి వంటి దేశాలు ప్రయాణం చేశాడు.
ఈ దేశాల పేర్లు ఏంటి కొత్తగా ఉన్నాయి. మేము ఎప్పుడూ వినలేదే అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవానికి ఐక్యరాజ్యసమితిలో ఉన్న దేశాలు 193. కానీ అవి కాకుండా ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటున్నాయి. వాటిని ఇంకా ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అంటాడు థోర్. తన యాత్రను మొత్తం 23 దేశాల మీదుగా చేశాడు. అందులో యూరప్ నుండి 37, సౌత్ అమెరికా 12, ఆసియా 20 ,ఆఫ్రికా 54 ఇలా ప్రపంచ పటంలోని అనే దేశాలు అతను చుట్టివచ్చాడు.
“మనుషుల్ని కలవడానికి…స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. 44 ఏళ్ల వివాహితుడు థోర్. డెన్మార్క్ లో నివాసం ఉంటాడు. కొంతకాలం మిలిటరీలో పనిచేసి ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్ లో పనిచేశాడు. ఇతనికి దేశాలు చూడమంటే మహా పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం వలన ఇష్టం. అందుకని ప్రపంచంలోనీ దేశాలు చుట్టుముట్టి రావాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా విమానయానం ద్వారా కాకుండా రైలు, ఓడలు ,వాహనాలు ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దాదాపు పదేళ్లపాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేసాడు. రోజుకు 20 డాలర్ల డెన్మార్క్ ఇచ్చిన కొన్ని సంస్థల స్పాన్సర్షిప్ తో తన యాత్రను మొదలుపెట్టాడు. ప్రయాణానికి, తిండికి, వీసాకు, ఫీజులను కలిపి కేవలం రోజుకు 20 డాలర్లు ఖర్చు చేస్తూ యాత్ర సాగించాలని నిర్ణయించుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస్సు పొందడం
లాంటి పనుల ద్వారా యాత్రను సాధ్యం చేయవచ్చు అని ఆలోచనతో ముందుకు వెళ్లాడు. అతను యాత్రను బ్లాగ్ లో, ఫేస్ బుక్ లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు థోర్ కు సహాయం చేశారు. ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే ఉండేవాడు. ఎందుకంటే మరో దేశానికి చేరుకోవడానికి అతనికి ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక ఆ దారిలో మనుషుల్ని కలవడం ఎక్కువగా ఇష్టపడేవాడు. అందులో భాగంగా అతను మన దేశానికి డిసెంబర్ 12, 2018 వచ్చాడు.
థోర్ తన ప్రయాణాన్ని నిజాయితీగా కొనసాగించాడు. ప్రతిదీ లెక్క రాసి పెట్టుకున్నాడు. తన ప్రయాణంలో టికెట్లతో సహా దాచి పెట్టాడు. అయితే కుటుంబానికి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడా.. అంటే లేదు.. తన భార్య వచ్చి తనను ఉన్నచోట కలుస్తూ ఉండేది. అట్లా 27 సార్లు తన భార్య వచ్చి తనను కలిసింది.అన్నట్టు ఈ యాత్రకు థోర్ పెట్టుకున్న పేరు మనం చెప్పుకోలేదు కదా ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’.