Tollywood Stars Remuneration : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రెమ్యూనరేషన్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. స్టార్ క్రేజ్ ని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో ఎవరైనా 10 లేదా 15 కోట్లు తీసుకుంటేనే గ్రేట్ అన్నట్టు ఉండేది కానీ జక్కన్న పుణ్యమా అని టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ 50కోట్లకు పై మాటే.. ఒక్కసారిగా మన టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం..
* ప్రభాస్ : బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ ఒక్కో మూవీకి 100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సందీప్ వంగ మూవీ స్పిరిట్ కోసం 150కోట్లు తీసుకున్నాడట.
* పవన్ కళ్యాణ్ : ఇటీవల వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ ఒక్కో మూవీకి 60 కోట్లు తీసుకొనున్నాడట.
* మహేష్ బాబు : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ సర్కారు వారి పాటకు 55 కోట్లు తీసుకున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB28 చేస్తున్నాడు.
* రామ్ చరణ్ : RRR తో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ కు 60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది.
* జూనియర్ ఎన్టీఆర్ : RRR మూవీకి 45 కోట్లు అందుకున్న యంగ్ టైగర్, కొరటాల NTR30కి 60కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట.
* చిరంజీవి : గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్లు కొట్టిన మెగాస్టార్ మార్కెట్ ప్రెస్రెంట్ 40 నుంచి 50 కోట్లు ఉందట.
* అల్లు అర్జున్ : పుష్ప బ్లాక్ బస్టర్ తో బన్నీ పుష్ప 2కి రెమ్యూనరేషన్ పెంచేసినట్టు సమాచారం. పుష్ప 2కి బన్నీ 60 కోట్లు అందుకోనున్నాడు.
* బాలకృష్ణ : అఖండకు 11 కోట్లు తీసుకున్న బాలయ్య, వీరసింహ రెడ్డికి 15 కోట్లు తీసుకున్నాడట.
* విజయ్ దేవరకొండ : వరుస పరాజయాలతో ఉన్న విజయ్ లైగర్ కు 15 కోట్లు తీసున్నాడట.
అలాగే నాగార్జున, వెంకటేష్ మార్కెట్ వాల్యూ 7 కోట్లు కాగా, రవితేజ 15 కోట్లు, నాని 10 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
Discussion about this post