Ugadi Festival 2023 : తెలుగు ప్రజలందరికీ ఉగాది చాలా ప్రత్యేకమైన పండుగ. తెలుగు సంస్కృతి ప్రకారం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే రోజు. ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున భక్తిశ్రద్ధలతో అందరూ ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. అందులో వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు, తీపి షడ్రుచులతో ఈ పచ్చడి చేస్తారు. అయితే ఈ పచ్చడిలో ఒక్కో రుచి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ రుచుల ప్రత్యేకత ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం..
★ తీపి : తీపి మంచికి గుర్తు. ఉగాది పచ్చడిలో బెల్లాన్ని కలుపుతారు.ఈ బెల్లం వల్ల ఆకలి పెరుగుతుంది. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. పిత్తా ,వాత సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడి, కొత్త కణాలు మన శరీరం ఏర్పడడంలో సహాయం చేస్తుంది.
★ ఉప్పు : ఉప్పు భయానికి సంకేతం. ఉప్పును ఉగాది పచ్చడిలో రుచికి తగినంత తక్కువగానే తీసుకుంటారు. ఉప్పు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
★ చేదు : చేదును బాధకి గుర్తుగా చెప్పుకుంటారు. ఉగాది పచ్చడిలో చేదు కోసం వేప పువ్వుని వాడుతారు. వేపలో బ్యాక్టీరియాలను చంపే ఎన్నో గుణాలు ఉన్నాయి.వేప మనం శరీరంలోని వ్యర్థలను బయటకు పంపి ,మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
★ పులుపు : పులుపు విసుకుకు సంకేతం. ఈ పులుపు కోసం చింతపండును ఉగాది పచ్చడిలో వాడుతారు .మనస్థితి ఎలా ఉన్నా కూడా విసుగు పడకుండా ఓర్పుతో ఉండాలని పులుపు ద్వారా చెప్తున్నాయి మన శాస్త్రాలు .పులుపు కూడా జీర్ణ సమస్యలు తగ్గుముఖం పట్టించి, కఫాన్ని తొలగించి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
★ వగరు : ఈ ఉగాది పచ్చడిలో ముఖ్యంగా వాడేది మామిడికాయలు .ఉగాది పండుగ తోనే మామిడికాయలు వాడుకలోకి వస్తాయి. వగరు కోసం పచ్చడిలో మామిడికాయలు వాడుతారు. ముఖ్యంగా శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి మామిడికాయలు.
★ కారం : మనిషి యొక్క సహనాన్ని కారం ద్వారా సూచిస్తారు. అందుకు ఈ కారాన్ని ఉగాది పచ్చడిలో వాడుతారు. జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో, శరీరంలో ఉన్న చెడు క్రిములను తగ్గించడానికి కారం ఎంతగానో దోహదపడుతుంది.
Discussion about this post