Unique Places : ప్రకృతి ఎంతో సుందరమైనది, రమ్యమైనది. ఈ ప్రకృతిలో కొండలు, గుట్టలు, మైదానాలు, పర్వతాలు, పచ్చని చెట్లు, పక్షులు ఎంతో సుందరమైన దృశ్యాలతో ఈ ప్రకృతి మామేకమై ఉంది. కానీ ఈ ప్రకృతిలో కూడా చూడడానికి ఎంతో సుందరంగా ఉండి, చూడలేకపోతున్నా ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి ఎందుకు చూడలేము.. వాటితో ప్రమాదం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రాన్స్ లోని లాస్కాక్స్ గుహలు : ఈ గుహల్లోకి కొందరు శాస్త్రవేత్తలు మాత్రమే వెళ్లగలరు ప్రజలందరూ వెళ్లలేరు ఎందుకంటే.. ఇక్కడ ఫంగస్ ఎక్కువగా ఉండడమే దానికి కారణం. వాయువ్య ఫ్రాన్స్ లో ఈ ప్రదేశం సుమారు 17వేల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ ప్రదేశాన్ని యూనేస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించడం గమనార్హం.
అండమాన్ లో నార్త్ సెంటినెల్ ద్వీపం : మడ అడవులు, పగడాలతో కప్పబడి ఉన్న అండమాన్ లోని ద్వీప సమూహాలలో అన్నింటికంటే చిన్నగా ఉండి ఉత్తర సెంటినెల్, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ద్వీపం సెంటినెల్లిస్ అనే జాతి ప్రజలను కలిగి ఉంది. ఈ జాతి ప్రజలు బయట ప్రపంచంతో కలవలేరు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎంత భిన్నం అంటే బయట మనుషులు ఎవరైనా వారి ప్రపంచానికి వెళ్తే చంపేసే అంతలా..
బ్రెజిల్ లోని స్నేక్ ఐలాండ్ లేదా క్యూమాడా గ్రాండే : దారి తప్పి పోవడానికి సరైన ప్రదేశంగా ఈ దీవి పేరుపొందింది. సావోపాలో తీరానికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంటుంది. ఇది మనుషులు నివసించడానికి పనికిరానటువంటి ప్రదేశం. ఇక్కడ చాలా ప్రాణాంతకమైన పాములు నివసిస్తూ ఉంటాయి. అవి ఎంత ప్రమాదకరం అంటే గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ అనే ఈ పాము కాటు వేస్తే క్షణాలలో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ ద్వీపంలో మొత్తం ఐదు రకాల పాములు నివసిస్తున్నాయి.
చైనాలోని క్విన్ షి హువాంగ్ సమాధి : చైనాకు చెందిన మొదటి చక్రవర్తి హువాంకి 210 బీసీలో మరణించారు. ఈ సమాధి ఆయనకు అంకితం. ఆయన మృతదేహాన్ని ఆక్కడే కొండకింద కణణం చేశారు.ఇది క్లిష్టమైన భూగర్భ గుహలలో ఒకటిగా నిలిచిపోయింది.
హువాంగ్ సైన్యం, గుర్రాలు, సిబ్బంది, పరిచారకుల చిత్రీకరించే ఎర్రకోట శిల్పాలు ఈ సమాధి చుట్టూ ఉంచారు. ఇప్పటివరకు రెండు వేల కంటే ఎక్కువ విగ్రహాలను ఇక్కడ గుర్తించారు. 8000 మందిని ఈ గుహలో ఖననం చేసినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.