నాలుగేళ్లపాటు NDAలో పదవులు అనుభవించి ఆఖరి సంవత్సరంలో ప్లేటు ఫిరాయించి బొక్క బోర్లా పడ్డారు చంద్రబాబు. అంతేకాదు.. నువ్వు గోడ్డుమోతోడివి, పరిపాలన చేతకాదు. మా మొహం మీద ఇంత మట్టి నీళ్లు కొట్టావు. అహంకారివి. నీ బుర్ర తిరిగే విధంగా సమాధానం చెప్పగలం అంటూ పార్టీ నేతలతో ఢిల్లీలో కోట్లరూపాయల ఖర్చుచేసి ధర్మపోరాట దీక్షలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయించాడు.
కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ ప్రతి అడుగులోనూ కేంద్రానికి మద్దతు ఇస్తూ సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటున్నారు. కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ రావడం వలన మోడీకి జగన్ అవసరం రాలేదు. కానీ వైసీపీని వదులుకోవడానికి మాత్రం కేంద్రం సిద్ధంగా లేదు. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోయే అమిత్ షా జగన్ ని తమ మిత్రుడిగానే చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ తో అమిత్ షా భేటీ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇప్పుడు ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలతో వైసిపి చేరనుందనే వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ జగన్ బేటీ ఖరారైంది. వచ్చే వారంలో ప్రధానిని ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు.
రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉంది. దాని వల్లే తమతో కలిసి వచ్చే పక్షాలను దగ్గర చేసుకుంటుందని ఢిల్లీ సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిరువురి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్థిక లోటు తో సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరం. ఈ సమయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం సృష్టించుకోవడం కంటే దగ్గరగా ఉండడం మేలని జగన్ భావన. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా జరిగితే త్వరలోనే ఎన్డీయేలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలియజెయ్యడానికే జగన్ మోహన్ రెడ్డి ఈ భేటీ లో స్పష్టం చేస్తారని వైసిపి వర్గాలనుండి వినిపిస్తోంది. ఇదే నిజమైతే రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహంలో మార్పు రావడం తధ్యం.
